ధనుష్, మంజు వారియర్ జంటగా తమిళంలో తెరకెక్కింది ‘అసురన్’. ఇది యాక్షన్ డ్రామా చిత్రం. ఈ చిత్రాన్ని వెట్రిమారన్ తెరకెక్కించారు. దసరా సెలవుల్లో తమిళనాట విడుదలైన అసురన్ సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుంది. ఈ మధ్య కాలంలో కేవలం కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే చేస్తున్న హీరో వెంకటేష్.. ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటించబోతున్నారు. తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించనున్నారు.
previous post
next post