31.2 C
Hyderabad
May 12, 2024 01: 11 AM
Slider జాతీయం

దావూద్ ఇబ్రహీంతో సంబంధాలపై ఈడీ ఎదుట మహారాష్ట్ర మంత్రి

#ministersaleemmalik

ముంబై అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం తో ఆర్ధిక లావాదేవీలు కలిగి ఉన్నాడనే ఆరోపణపై మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన నవాబ్ మాలిక్‌ మనీలాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్నాడు. దావూద్ ఇబ్రహీం అతని సహాయకులకు సంబంధించిన అక్రమ ఆస్తుల లావాదేవీలు, హవాలా లావాదేవీలు, అండర్‌వరల్డ్‌ కార్యకలాపాలకు సంబంధించి ఫిబ్రవరి 15న ముంబైలో కొత్త కేసు నమోదు చేసి దాడులు చేసిన తర్వాత ఈడీ ఈ చర్య తీసుకుంది. దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి ఉదయం 8 గంటల సమయంలో వచ్చారని, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అతని వాంగ్మూలాన్ని నమోదు చేశామని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాపర్టీ లకు సంబంధించిన లావాదేవీలలో మాలిక్‌కు ఉన్న లింకులు బయటపడటంతో మంత్రిని ప్రశ్నించడం తప్పనిసరి అయింది. గత ఏడాది అక్టోబర్‌లో ఒక క్రూయిజ్‌లో దాడులు నిర్వహించి, నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో సహా 20 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిలో మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్‌ కూడా ఉన్నాడు. డ్రగ్స్ కేసులో గతేడాది ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అతడిని అరెస్ట్ చేసింది. పకడ్బందిగా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే మంత్రిని విచారించినట్లు అధికారులు చెబుతున్నారు.

Related posts

రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన కొరముట్ల

Satyam NEWS

రూట్ మారిన వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారి

Satyam NEWS

వైసీపీలో కలకలం రేపిన తెలంగాణ సీఎం వ్యాఖ్యలు

Satyam NEWS

Leave a Comment