39.2 C
Hyderabad
April 28, 2024 11: 28 AM
Slider కరీంనగర్

రూట్ మారిన వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారి

#Warangal Karimnagar National High Way 1

కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి రూట్ మారింది. మొదట జగిత్యాల నుంచి కోదాడ వరకు ఉన్న జాతీయ రహదారి కాస్తా ప్రస్తుతం కరీంనగర్ వరంగల్ రహదారి గా మారింది. వివిధ రాజకీయ కారణాలతో జగిత్యాల కరీంనగర్ రహదారి ప్రస్తుతం రద్దు అయింది.

జగిత్యాల నుంచి కరీంనగర్ వరకూ రహదారి విస్తరణ వల్ల అనేక మంది తమ ఆస్తులు పోగొట్టుకోవడమే కాకుండా పచ్చని పొలాలు కాస్తా మాయం అవుతాయని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి NH 563 అధికారుల పై ఒత్తిడి తెచ్చారు. దాంతో అధికారులు ప్రస్తుతానికి ఈ రోడ్డు విస్తరణ పనులకు బ్రేక్ వేశారు.

ఆందోళనలతో మారిన ఎలైన్ మెంట్

వరంగల్ కోదాడ రోడ్డు విస్తరణ పనులకు సైతం రోడ్డు సర్వే పనులకు బ్రేక్ పడటమే కాకుండా అక్కడి నాయకులు సైతం పెద్ద మొత్తంలో భూములు కోల్పోయిన వారి తరపున నిలబడి ఆందోళన  చేయడంతో అక్కడ సైతం బ్రేక్ వేశారు. ఇక మిగిలింది కరీంనగర్ వరంగల్ రహదారి.

ఈ రహదారి మొదట కరీంనగర్ మనకొండూర్ కోతగట్టు ,సింగాపుర్ గ్రామాల వరకు వచ్చి ఇక్కడ నుండి తుమ్మనపల్లి, బోర్ణపల్లీ, నర్శింగాపుర్ ల మీదుగా కే సీ కాంప్ గుండా NH 563 మళ్లీ మొదలై వరంగల్ అర్బన్ లోని పెంచికల్ పేట్, కొత్తులనడుమ వల్లభాపురం సూరారం ల గుండా ఎల్కతుర్తి స్టార్టింగ్ లో బైపాస్ తో వెళుతుంది.

అక్కడ నుంచి సనంతసాగర్ గుండా వెళ్ళి హసన్ పర్తి, చింతగట్టులోని రింగ్ రోడ్డు హైవే లో కలిసేది. కాగా ప్రస్తుతం వివిధ రాజకీయ కారణాల వల్ల ఎమ్మెల్యే అరూరి రమేష్ అభ్యంతరాలతో హసన్ పర్తి బైపాస్ కాస్తా మారి మరో అరు కిలో మీటర్లు పెరిగి పెంబర్తి, ముచర్ల నగరం ద్వారా రింగ్ రోడ్డును కలుపుతున్నారు.

తీవ్రంగా నష్టపోతున్న దళిత కాలనీలు

కరీంనగర్ జిల్లాలో సింగపూర్ నుండి మారిన ఎలైన్ మెంట్ ప్రకారం సిర్శపల్లీ, కందుగుల ద్వారా వరంగల్ జిల్లా పెంచికల్పేటలో కలుపుతున్నారు. ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు సింగపూర్ సతీష్ బాబు, హసన్ పర్తి లో రమేష్ ఎందుకు ఎలైన్ మెంట్ మార్చారు అన్న విషయం పక్కకు పెడితే ప్రస్తుతం ఈ రోడ్డు వల్ల పోయేది కేవలం వల్లభాపూర్, కొత్తలనడుమ గ్రామాల్లోని రెండు దళిత కాలనీలు మొత్తం పోతున్నాయి.

వీరికి గుంట భూమిలేదు. చేసుకుంటేనే బతుకు…లేకపోతే ఉపాసమే. కందుగుల నుండి నేరుగా పోలాల నుండి దండేపల్లి మీదుగా బహుపెట్ వరకు షార్ట్ కట్ లోఎలాంటి వంకరలు లేకుండా రహదారి విస్తరణ చేసే అవకాశం ఉన్నా కేవలం దళితులే కదా వీరేం చేస్తారు అన్న కారణంగా  రెండు దళిత కాలనీలలో దాదాపుగా రెండు వందల కుటుంబాలు మాయం చేయాలని చూస్తున్నారు.

ఈ విషయంపై ఎమ్మెల్యే సతీష్ కుమార్, ఎంపి బండి సంజయ్ స్పందంచకపోవడంతో అవసరమైతే ఆత్మహత్యలకు సిద్దపడుతామే తప్ప మా భూములు, ఇళ్లను  ఇవ్వమని అక్కడి దళితులు ఉద్యమానికి సిద్ధపడుతున్నారు. బంగారు తెలగాణ లో దళితులకు న్యాయం జరుగుతుందనుకుంటే ఉన్న ఇళ్లను కూల్చివేసే సర్కారును వదిలిపెట్టేది లేదని వారు అంటున్నారు.

ఇదేనా బంగారు తెలంగాణ అంటే

మాకు న్యాయం చేయాలంటే సింగపూర్, హసన్ పర్తి ల మాదిరిగా ఎలైన్ మెంట్ మార్చాలే తప్ప డబ్బులు ఇప్పిస్తామని ఆశ చూపి ఉన్న ఇళ్లను కూల్చి వేయడం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎంపి, ఎమ్మెల్యే స్పందించి కందుగుల నుండి నేరుగా బహుపేట్ వద్ద NH565 కు కలిపితే ఎవరి ఇళ్లు కోల్పోవాల్సిన అవసరం ఉండదని వారు అంటున్నారు.

Related posts

అజయ్ కల్లాం అసలు చదివే ఐఏఎస్ అయ్యావా?

Satyam NEWS

సెట్విన్ ఆధ్వర్యంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులు

Bhavani

పేదల పెన్నిధి, అభ్యుదయ వాది శానంపూడి అంకిరెడ్డి వర్ధంతి

Satyam NEWS

Leave a Comment