29.7 C
Hyderabad
May 7, 2024 04: 29 AM
Slider జాతీయం

ముత్తూట్ ఫైనాన్స్ లో నిరవధిక సమ్మె ప్రారంభం

th

ఉద్యోగుల తొలగింపును నిరసిస్తూ ముత్తూట్ ఫైనాన్స్ లో నిరవధిక సమ్మె ప్రారంభమైంది. సెటిల్‌మెంట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ 166 మంది ఉద్యోగులను ఇటీవల ముత్తూట్ ఫైనాన్స్ తొలగించిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల కిందట కేరళ సిఐటియు సమ్మె నోటీసు ఇచ్చినా యాజమాన్యం ఖాతరు చేయకపోవడంతో సమ్మె అనివార్యమైందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కెఎన్ గోపీనాథ్, నాన్ బ్యాంకింగ్, ప్రైవేట్ ఫైనాన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (సిఐటియు) ముత్తూట్ ఫైనాన్స్ యూనిట్ కార్యదర్శి నిషా కె. జయన్, ప్రధాన కార్యదర్శి సి రతీష్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

166 మంది ఉద్యోగుల తొలగింపును నిరసిస్తూ గతంలో 52 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ సమయంలో కార్మిక సంఘానికి యాజమాన్యానికి ఒక ఒప్పందం కుదిరింది. అయితే ఆ ఒప్పందాన్ని ముత్తూట్ ఫైనాన్స్ యాజమాన్యం అమలు చేయకపోవడంతో మళ్లీ సమ్మె ప్రారంభమైంది. సంస్థకు లాభాలు లేకపోవడం వల్లే ఉద్యోగుల తొలగింపు అనివార్యమౌతున్నదని ముత్తూట్ యాజమాన్యం అంటున్నది.

అయితే ఇది తప్పుడు వాదనగా కార్మిక సంఘాలు కొట్టిపారేస్తున్నాయి. లాభాలలో ఉన్నా కూడా కొన్ని బ్రాంచీలను ముత్తూట్ ఫైనాన్స్ మూసేస్తున్నదని వారు అంటున్నారు. ఒక బ్రాంచ్ మూసేసినప్పుడు ఉద్యోగులను మరొక బ్రాంచికి బదిలీ చేయాలి తప్ప తీసేస్తే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటూ ముత్తూట్ ఫైనాన్స్ లాభాలను ఆర్జిస్తున్నదని వారు అంటున్నారు.   

Related posts

రెడ్ హ్యాండెడ్: నలుగురు గుట్కా స్మగ్లర్ల అరెస్ట్

Satyam NEWS

కుడితిలో పడ్డ ఎలుకల్లా మారిన వైసీపీ నేతలు

Satyam NEWS

పార్టీ నుంచి బీఆర్ఎస్ నేతలు సస్పెన్షన్

Murali Krishna

Leave a Comment