Slider ముఖ్యంశాలు

మోదీ కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలే: మల్లు రవి

#Mallu Ravi

రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి అందుబాటులో ఉండి కార్యక్రమానికి హాజరుకాకపోవడం తెలంగాణ కు నష్టం చేకూరుస్తుందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి వ్యాఖ్యానించారు. కేసీఆర్ వైఖరి వల్ల సింగరేణి ప్రైవేటీకరణ గురించి, తెలంగాణకు హక్కుగా రావాల్సిన అంశాల గురించి మాట్లాడే బంగారం లాంటి అవకాశం కోల్పోయామని ఆయన అన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇద్దరు కలిసి తెలంగాణకు తీరని నష్టం చేస్తున్నారని ఆయన అన్నారు. మోదీని  రాష్ట్ర సర్కార్ గట్టిగా నిలదీయాల్సింది పోయి మౌనంగా వుండటం అన్యాయమని మల్లు రవి అన్నారు.

మోడీ తెలంగాణ కు వచ్చినపుడు కేసీఆర్ సభలో పాల్గొని తెలంగాణ హక్కులు, అవసరాలు, రావాల్సిన అంశాలపై ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. బీజేపీ కేంద్రం ద్వారా  అసలు తెలంగాణకు చేసింది ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టంలో తెలంగాణ కు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? తెలంగాణ లో కుటుంబ పాలన, అవినీతి జరుగుతుందని చెప్పారు మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ఆయన ప్రశ్నించారు.

ఇక్కడ ఎంపీ అరవింద్ నుంచి మోడీ వరకు అందరూ కేసీఆర్, కుటుంబ అవినీతిపైన ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎం లాగా మారిందని మోడీ గతంలో అన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి పైన మా దగ్గర ఆధారాలు ఉన్నాయని బండి సంజయ్ నుంచి మోడీ వరకు అందరూ అన్నారు. మరి ఎందుకు చర్యలు లేవు. కేసీఆర్ కుటుంబ అవినీతిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. మీ ఇద్దరు తోడు దొంగలు కాదా అని ఆయన ప్రశ్నించారు.

Related posts

కోమటిరెడ్డితో పొంగులేటి చర్చలు

Bhavani

షేమ్ షేమ్: భారత భూభాగం నుంచి పాకిస్తాన్ కు కితాబు

Satyam NEWS

వివాహ వ‌య‌సు పెంచితే.. కొంద‌రికి బాధ

Sub Editor

Leave a Comment