28.2 C
Hyderabad
April 30, 2025 05: 31 AM
Slider సినిమా

భార్యతో కలిసి చంద్రబాబుతో భేటీ అయిన మంచు మనోజ్‌

#manchumanoj

సినీ నటుడు మంచు మనోజ్‌ దంపతులు సోమవారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. మనోజ్‌తో పాటు ఆయన సతీమణి భూమా మౌనికా రెడ్డి కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు.  అమరావతిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన మౌనిక దంపతులు ఆయనతో సమావేశమయ్యారు.

2019 ఎన్నికల నుంచి మనోజ్ రాజకీయ అరంగేంట్రం చేయబోతున్నారని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం అయిన ఓ స్థానం నుంచి పోటీచేస్తారని వార్తలొచ్చాయి. అది కూడా వైసీపీ తరఫున అని ప్రచారం జరిగింది. అప్పుడు మంచు ఫ్యామిలీ వైసీపీలోనే ఉంది.

దీనికి తోడు ఎన్నికల ముందు ఒకట్రెండు నియోజకవర్గాల్లో మనోజ్ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అయితే ఏం జరిగిందో తెలియట్లేదు కానీ ఆయన రాజకీయాలలోకి రాలేదు. మనోజ్ సతీమణి భూమా మౌనికా రెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. భూమా ఫ్యామిలీకి కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.

భూమా నాగిరెడ్డి మరణాంతరం ఫ్యామిలీకి అన్నీ తానై ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో అంతా మౌనికనే చూసుకున్నారు. నంద్యాల నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిల ప్రియ గెలవడానికి కర్త, కర్మ, క్రియ.. మౌనికానే అని అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇంత ఆదరణ ఉన్న మౌనిక రాజకీయాల్లోకి రావాలని చాలారోజులుగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

పెళ్లయ్యాక మౌనిక రాజకీయ అరగేంట్రం గురించి మనోజ్ స్పందిస్తూ ఆమె ఓకే అనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పేశారు. అయితే సమావేశం అనంతరం మాట్లాడిన మనోజ్‌ తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టత నిచ్చారు. కేవలం చంద్రబాబు ఆశీస్సులు తీసుకునేందుకు కుటుంబ సమేతంగా వచ్చామని మనోజ్‌ చెప్పారు.

Related posts

అల్లం సుదర్శన్ మృతి తీరని లోటు

Satyam NEWS

చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే

Satyam NEWS

తెలంగాణలో మావోయిస్టు పార్టీది ముగిసిన అధ్యాయం

Murali Krishna

Leave a Comment

error: Content is protected !!