38.2 C
Hyderabad
May 5, 2024 21: 26 PM
Slider నిజామాబాద్

రాజకీయ లబ్ది కోసమే రైతులతో సమావేశాలు

#masterplan

‘మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు తీర్మానం చేయుమని చెప్పినం. అలా కాని పక్షంలో విలీన గ్రామాల కౌన్సిలర్ల రాజీనామాకు పట్టుబట్టినం. అలా కాకుండా రైతులను సముదాయించే పని పెట్టుకున్నారు. ఇలా అయితే ఈ పంచాయతీ తెగేది కాదు. కేవలం వారి రాజకీయ లబ్ది కోసమే మనతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా ముందుగానే ఎందుకు స్పందించలేదు. ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే. లేదా కౌన్సిల్ తీర్మానం చేయించాలి.’ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు చెప్తున్న మాటలివి.

నిన్న పొందుర్తి శివారులోని ఓ ఫార్మ్ హౌస్ లో ఎమ్మెల్యేతో కౌన్సిలర్ల సమావేశం అయినట్టుగా సమాచారం బయటకు వచ్చింది. రైతులకు తాము మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తున్న విషయాన్ని అర్థం అయ్యేలా చెప్పాల్సిన బాధ్యత కౌన్సిలర్లకు అప్పగించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ రోజు బాధిత రైతులకు సంబందించిన అన్ని గ్రామాల్లో రైతులతో అధికార పార్టీ కౌన్సిలర్లు సమావేశమయ్యారు. ఆ గ్రామాల్లో ఉన్న సమస్య పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ‘మాస్టర్ ప్లాన్ లో మీరు కొరినట్టుగానే మీ గ్రామానికి సంబంధించిన భూముల్ని తొలగించేలా చేస్తాము.

అలా చేయలేకపోతే మీ ఉద్యమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాము’ అంటూ రైతులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. అది అనుకున్నంతగా వర్క్ ఔట్ అవుతున్నట్టుగా కనిపించడం లేదు. దానికి ఉదాహరణ ఒక్కటే. కౌన్సిలర్లు వెళ్లిన తర్వాత మళ్ళీ రైతులు సమావేశమై ఇదంతా కుదరని పని. వీళ్లు మనముందు ఇలాగే చెప్తారు. వెనకాల చేసేది చేస్తున్నారు అంటు మాట్లాడుకుంటున్నారు. అంటే కౌన్సిలర్ల మాటలు, వాళ్ళు రాసిస్తున్న రాతలను రైతులు నమ్మడం లేదన్నది స్పష్టంగా తెలుస్తుంది.

రైతులతో కౌన్సిలర్లు, ముఖ్య నేతల భేటి

నేడు విలీన గ్రామాల రైతులతో అధికార పార్టీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు భేటి అయ్యారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సహా విలీన గ్రామాలకు చెందిన కౌన్సిలర్లు రైతులతో సమావేశమయ్యారు. లింగాపూర్, టెక్రియల్, పాత రాజంపేట, అడ్లూర్ గ్రామాల్లో రైతులతో ఆయా గ్రామాల కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా రైతులు కౌన్సిలర్లపై ఆగ్రహం వ్యక్తం చేయగా కౌన్సిలర్లు రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం అయితే చేశారు.

రైతులు నమ్మకపోవడంతో మీరెలా అంటే అలా రాసి ఇస్తామని చెప్పడంతో సమస్య పరిష్కారం కాకపోతే రాజీనామా చేస్తామని రాసివ్వాలని కోరగా ఎక్కడ కూడా తాము రాజీనామా చేస్తామని స్పష్టంగా పేర్కొనలేదు. పైగా రైతులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రియల్ జోన్ పూర్తిగా తొలగిస్తామని, మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం చేస్తామని ఎక్కడ ప్రకటించడం లేదు.

మాస్టర్ ప్లాన్ ప్రకారం లింగాపూర్ గ్రామంలో వంద ఫీట్లు, 80 ఫీట్ల రోడ్డు, గ్రీన్ జోన్ తొలగించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ కు లేఖ ఇస్తున్నట్టుగా లెటర్ ప్యాడ్ పై రాసి సంతకం పెట్టి రైతులకు అందజేయగా అందులో రాజీనామా చేస్తామని పేర్కొనాలని చెప్పడంతో ఒక వైపు నోట్ అని రాసి పైన రాసిన నిబంధనలు అమలు కానీ యెడల మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా.చేయుటకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ లెటర్ ను రైతులతో కలిసి మున్సిపల్ కమిషనర్ కు ఇస్తామని చెప్పినా ఈరోజు సెలవు కావడంతో ఆ లెటర్ ను రైతులకే అందజేశారు.

ఉద్యమానికే జై కొడుతున్న రైతులు

ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇప్పటికే ప్రెస్ మీట్ నిర్వహించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమకు తెలియకుండానే ఇండస్ట్రియల్ జోన్లోకి వ్యవసాయ భూములు చేర్చారని, అనేక రోడ్లు తమకు తెలియకుండానే మాస్టర్ ప్లాన్ లో చేర్చారని, ఇదంతా డిటిస్పిఅధికారులు, డీడీఎఫ్ కన్సల్టెన్సీ వారి తప్పిదమేనని, వారిపై చర్యలకు మంత్రి కేటీఆర్ ను తానే కలిసి వివరిస్తానని పేర్కొన్నారు. రైతులకు చెందిన ఒక్క గుంట భూమి పోకుండా చూసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.

అదే రోజు కలెక్టర్, అంతకుముందు రోజు బీఆర్ఎస్ నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు ప్రెస్ మీట్ నిర్వహించి రైతుల భూములు తీసుకోవడం లేదని వివరించారు. అయినా రైతులు తమ కార్యాచరణ ప్రకటిస్తూనే ఉన్నారు. మున్సిపల్ ముందు ధర్నా నిర్వహించారు. రాజీనామా చేయాలని రైతులు అల్టిమేటం ఇవ్వడంతో కౌన్సిలర్లు రైతులను కలిసి నచ్చజెప్పినా కౌన్సిలర్ల మాటలు విన్నట్టుగా చెప్తూనే భవిష్యత్ కార్యాచరణపై సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు.

రేపు సంక్రాంతి పండగ ఉన్నా ఆ పండగను జిల్లా కేంద్రంలోని రోడ్లపైనే నిర్వహించుకోవలని నిర్ణయించారు. రేపు ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు రైతులు తమ కుటుంబ సభ్యులతో చేరుకుని ప్రధాన రోడ్లపై ముగ్గులు వేయాలని నిర్ణయించారు.

Related posts

National Politics: కేసీఆర్ కు క్లారిటీ ఉందా?

Satyam NEWS

అయ్యప్ప భక్తులకు శుభవార్త

Bhavani

ఖ‌మ్మంలో టీఆర్ఎస్ కు భారీ షాక్‌

Satyam NEWS

Leave a Comment