29.7 C
Hyderabad
May 6, 2024 07: 00 AM
Slider నిజామాబాద్

మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అరెస్ట్

#kamareddy

రైతు కల్లాలపై కేంద్రం తీరుకు బీఆర్ఎస్ ధర్నాలో ఊహించని పరిణామం

రైతు కల్లాలను ఉపాధి హామీ నిధులతో నిర్మించారని, వాటికి సంబంధించిన 151 కోట్లను కేంద్రానికి చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ విధానానికి నిరసనగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటిసారిగా రైతుల నుంచి ఊహించని పరిణామం ఎదురైంది.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాలో భూములు కోల్పోతున్న రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. నేటి ధర్నాలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొంటున్నారని తెలుసుకుని నిరసన తెలపడానికి భూ బాధితులు నిర్ణయించారు. ధర్నా ప్రారంభం కాగానే ప్లకార్డులు పట్టుకుని ధర్నా వద్దకు చేరుకున్నారు. దాంతో పోలీసులు అప్రమత్తమై నిరసన తెలుపుతున్న రైతులను పక్కకు తీసుకెళ్లారు.

రైతులను కొద్ది దూరం వరకు తీసుకెళ్లినా మళ్ళీ రావడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేస్తున్న రైతులపై దాడికి యత్నించారు. గమనించిన పోలీసులు రైతులను అక్కడినుంచి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పొలిసి స్టేషన్ కు తరలించారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని, భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యేను కలిసి విన్నవించడానికి వస్తే పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. మాస్టర్ ప్లాన్ పై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేసేవరకు ఆందోళనలు ఆపే ప్రసక్తి లేదన్నారు.

Related posts

శ్రీరాం సాగ‌ర్ జలాశయంలో చేప పిల్లల్ని వదిలిన మంత్రులు

Satyam NEWS

దగా పడ్డ రైతుకు అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే

Bhavani

ఈ ఫొటోకు క్యాప్షన్ లేదు… ఈ వార్తకు హెడ్డింగ్ లేదు

Satyam NEWS

Leave a Comment