37.2 C
Hyderabad
April 26, 2024 20: 05 PM
Slider ప్రత్యేకం

ఈ ఫొటోకు క్యాప్షన్ లేదు… ఈ వార్తకు హెడ్డింగ్ లేదు

#gadwal

ఈ ఫొటోలో కనిపిస్తున్న పసికందులకు ఒకరితో ఒకరికి సంబంధం లేదు. వేరు వేరు తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు వీళ్లు. మరి అందరూ ఒకే చోట ఉన్నారేంటి? అందరూ ఒకో చోట పడుకున్నారేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే చంద్రకళ ను అడగాలి. చంద్రకళ ఎవరు అనేగా ఆలోచిస్తున్నారు…. ఆమె జోగులంబ గద్వాల జిల్లా అయిజ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సు.

ఈ విషయం చెప్పగానే సగం స్టోరీ అర్ధం అయి ఉంటుంది.

ఒకే రోజులో 7 కాన్పులు చేసి స్టాఫ్ నర్సు చంద్రకళ రికార్డు సృష్టించింది. ఆమె చేతుల నుంచి పుట్టిన ఏడు మంది పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. అంతే కాదు, డెలివరీ అయినా తల్లులు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఇంత ఘనత సాధించిన చంద్రకళను అభినందించాల్సిందే కదా? ఈ విషయంలో మెడికల్ ఆఫీసర్  డాక్టర్ రామలింగారెడ్డి ఆమెను అభినందించారు.

ముకుందుని వార్త ప్రపంచం

Related posts

కీలకమైన రెండు కేసులు….: ఈ సీబీఐ కి ఏమైంది?

Satyam NEWS

గిడ్డంగులలో ప్రైవేటు వ్యక్తులదే పెత్తనం

Bhavani

ఏపీ రాజధానిపై వైవీ సుబ్బారెడ్డి  సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

Leave a Comment