39.2 C
Hyderabad
May 4, 2024 22: 55 PM
Slider వరంగల్

తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మే డే

కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలని ములుగు జిల్లా తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి ఎండి గఫూర్ పాషా అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో నేడు మేడే కార్మిక దినోత్సవం జరిగింది.సంఘం జిల్లా కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1890 మే 1వ తేదీన సెయింట్‌ లూయిస్‌ లో నిర్వహించిన అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ సదస్సులో 8 గంటల పని దినం, సుస్థిర శాంతి సమర నినాదాలుగా మారాయి. 1889 జులై 14న పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ కార్మిక మహాసభ మేడే ని అంతర్జాతీయ శ్రామిక దినంగా గుర్తించాలని నిర్ణయించింది.

1905లో రష్యా లోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ లోని రాజభవనం (వింటర్‌ ప్యాలెస్‌) దగ్గర రష్యన్‌ కార్మికులు గుమిగూడారు. వీరి మీద రష్యన్‌ సైనికులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. స్త్రీలు, పురుషులు, పిల్లలను చావబాదారు. మేడే సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ అమరవీరుల స్మారక దినంగా మారింది.

1917లో ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు 8 గంటల ఆందోళనలకు దిగారు. ”8 గంటల కంటే నేను పని చేయను” అనే నినాదం మిన్నుముట్టింది. ఇటలీ లో మేడే నాడు శ్రామికులపై పోలీసు కాల్పులు జరిగాయి. మేడే నిరసన ప్రదర్శనల ప్రభావం అడాల్ఫ్‌ హిట్లర్‌పై పడింది. 1933లో హిట్లర్‌ సైతం మేడే ప్రదర్శకుల డిమాండ్లను సమర్ధించాడు. ప్రపంచవాప్తంగా సాగిన పోరాటాలతోనే 8 గంటల పని అమలు లోకి వచ్చింది.

పెట్టుబడిదారీ విధానంపై జరిగిన మొదటి తిరుగుబాటు మేడే. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన మేడే నిరసనలు, కార్మిక వర్గ ఉద్యమాలు వర్గ పోరాట సిద్ధాంతాన్ని పదును పెట్టాయి. కారల్‌ మార్క్స్‌ ‘కమ్యూనిస్టు ప్రణాళిక’లో చెప్పిన ”ప్రపంచ కార్మికులారా ఐక్యం కండు”… ఓ నినాదంగా రూపొందింది.

వర్గ పోరాట సిద్ధాంతాన్ని ప్రపంచం నలు మూలలకు వెదజల్లింది. వర్గ పోరాటాన్ని పదును పెట్టి దేశ పరిస్థితులకు అన్వయించి మన దేశంలో కార్మిక కర్షక ఐక్య పోరాటాలు జరగాలని దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఢిల్లీలో జరిగినటువంటి రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోవాలని కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో లో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు కంఠం సత్యం, బోగత విజయ్ కుమార్, నాయకులు, గొల్లపల్లి యాకయ్య, గణేష్, బోడ రమేష్, చంటి , తదితరులు పాల్గొన్నారు.

Related posts

దారుణమైన పరిస్థితిలో ఉన్న హైదరాబాద్ మహానగరం

Satyam NEWS

కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ నేతలు

Satyam NEWS

చేతన ఫౌండేషన్ సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్

Murali Krishna

Leave a Comment