38.2 C
Hyderabad
May 5, 2024 19: 42 PM
Slider కవి ప్రపంచం

శ్రమ సంస్కృతి దినోత్సవ”మే” డే

#Purimalla Sunanda New

పోరుబాటలో నడిచిన చెమట చుక్క
చికాగో నగరం సాక్షిగా
సాధించిన విజయం
కార్మికుల ఐక్యతా శక్తి
ఎగరేసిన అస్థిత్వ పతాకం!

వద్దు వద్దు బానిస బతుకంటూ
లాఠీలకు తూటాలకు అదరక బెదరక
శ్రమ దోపిడిని నిరసిస్తూ
పరిమిత పనిగంటల కోసం
పెట్టుబడి దారీ వ్యవస్థపై
ఎక్కుపెట్టిన ఉద్యమ పిడికిలి!

అమరులైన ఎందరో
వీరుల త్యాగాలను స్మరించుకుంటూ
జరుపుకుంటున్న
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం..

సమాజ అభివృద్ధికి పునాది రాళ్ళయి
తమ రెక్కల కష్టంతో
ప్రజల సుఖ సౌఖ్యాల సోపానాలుగా మార్చిన
శ్రమ జీవన సౌందర్యానికి
ఖరీదు కట్టగల గలమా
కార్మిక సేవల ఋణం తీర్చు కోగలమా..

కార్మిక కర్షక శ్రమ సంస్కృతికి జేజేలు పలుకుతూ
మేడే శుభాకాంక్షలు తెలుపుదాం అందరం..

వురిమళ్ల సునంద, ఖమ్మం

Related posts

జై కిసాన్ కు విలువేది?: వినూత్న నిరసన తెలిపిన CITU

Satyam NEWS

గిరివికాసం పథకాలు తక్షణమే గ్రౌండింగ్ కావాలి

Satyam NEWS

ఆకస్మికంగా సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ

Satyam NEWS

Leave a Comment