39.2 C
Hyderabad
May 3, 2024 14: 54 PM
Slider నిజామాబాద్

మేడే:కార్మికుల పోరాట ఫలితమే ఇప్పటి స్వేచ్ఛ

#Kotagiri

కార్మికుల నిరంతర పోరాట కృషి ఫలితమే మేడే అని సీపీఐ నాయకులు విఠల్ గౌడ్ అన్నారు. ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా కోటగిరి బస్టాండ్ ఆవరణలో సీపీఐ, ఏఐటీయూసీ, జెండాలను సమాజికదూరం పాటిస్తూ విఠల్ గౌడ్, నాగిరెడ్డి మెస్ట్రీ ఎగురవేశారు.

మేడే సందర్భంగ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ కోటగిరి మండల ప్రధాన కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థను అంతం చేసి కార్మికుల శ్రమదోపిడి శాశ్వతంగా విముక్తి కావాలన్న తమ లక్షాన్ని తెలియచెప్పే రోజే మేడే అని అన్నారు.

రోజుకు 18 నుండి 20 గంటల పనులను రద్దుచేసి 8 గంటలపని కావాలని దశాలవారి జరిగిన పోరాటం మే -1 -1886 చికాగో నగరంలోని కార్మికులంతా విధులు  బహిష్కరించి చేసిన పోరాటమే మేడే అని చెప్పరు. ప్రభుత్వం జరిపిన పోలీస్ కాల్పుల్లో ఎంతోమంది కార్మికుల రక్తంతో తడిసిన బట్టలే ఎర్రజెండలై నేటికి ప్రతి మేడే రోజు జెండాపై ఎగురుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నల్ల గంగధర్, రాములు, రాజు, దత్తు, సీపీఐ ఏఐటీయూసీ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి

Satyam NEWS

రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్

Satyam NEWS

డోర్నకల్‌ – మిర్యాలగూడెం రైల్వే లైను ఎలైన్‌మెంట్‌ మార్పుచేయాలి

Bhavani

Leave a Comment