24.7 C
Hyderabad
March 26, 2025 09: 03 AM
Slider హైదరాబాద్

దాండియా కళాకారులకు నిత్యవసర వస్తువులు

#EagleFoundation

మే డే సందర్భంగా టీం బీ.ఎస్. అర్ వ్యవస్థాపక అధ్యక్షులు బేతి సుమంత్ రెడ్డి 50 మంది నిరుపేద దాండియా కళాకారులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం  హబ్సిగుడ డివిజన్  డివిజన్ లో జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఈగల్ మీడియా స్థాపించిన  ఈగల్ ఫౌండేషన్ సీఈఓ సందీప్ ,  మిమిక్రీ కళాకరుడు ఆల్ రౌండర్ రవి, సుమన్ టీవీ  యాంకర్ నాగరాజు  నిర్వహించారు. ఈ సందర్భంగా సుమంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తో పాటు ఇలా సమాజం పట్ల బాధ్యత తో ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.  

వినూత్నంగా ఆలోచించి  స్వల్ప వేతనం తో జీవితాన్ని సాగించే దాండియా కళాకారుల గురించి ఆలోచించి సహృదయం తో  సహాయం అందించడం పై ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి  అభినందనలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అప్సిగూడ తెరాస జనరల్ సెక్రెటరీ కొంగర శ్రీధర్ ఐ డ్రీమ్ టి ఎన్ ఆర్ కళాకారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

యువర్ హైనెస్: హిమాలయాల సమీపంలో శ్రీవారి ఆలయం

Satyam NEWS

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు

Murali Krishna

అవినీతి నేతలకు చరిత్రలో స్థానం లేదు

mamatha

Leave a Comment