41.2 C
Hyderabad
May 4, 2024 16: 00 PM
Slider విజయనగరం

చాకిరీ చేయించుకుని బడ్జెట్ లేదని ఎమ్.ఇ.సి.సి లను రోడ్డున పడేస్తారా

#vijayanagaram

మెప్మాలో ప్రభుత్వ కార్యకాలాపాలను, పథకాలను ప్రజలకి చేరువచేస్తూ అతితక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్న ఎంఇసిసి లను బడ్జెట్ లేదని కుంటిసాకు చూపి వేతనాలు ఎగ్గొట్టి ఆర్ధాంతరంగా విధుల్లోంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమని ఏఐటీయూసీ విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పై మండిపడ్డారు.

ఈ మేరకు ఎపి ఎంఇసిసి ఎంప్లాయిస్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) జిల్లా స్థాయి సమావేశం స్థానిక మున్సిపల్ నగర పాలక కార్యక్రమంలో ఉన్న మెప్మా కార్యాలయంలో యూనియన్ అధ్యక్షులు కోండ్రు.సత్యవతి అధ్యక్షత జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ ఉపాధి కల్పనకు తోడ్పడాల్సిన మెప్మా ఉపాధి నిర్మూలన వైపు అడుగులేయటం దురదృష్టకరమని తెలిపారు.

ఎంఇసిసిలను విధుల్లో కొనసాగించి వారికి బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మహిళాభివృద్ధే ధ్యేయమని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు మహిళలు పనిచేస్తున్న రంగాలనే మూసివేసి ఉద్యోగాల నుంచి తొలగించి మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తుందని విమర్శించారు. ఈ విధానం వలన మహిళాభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు.

బడ్జెట్ లేదనే నెపంతో చిన్న ఉద్యోగులపై ప్రభుత్వం సీతకన్ను వేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం 2 వేల నుంచి 5 వేల రూపాయల వేతనాలు ఇస్తూ 365 రోజులు పగలనక, రాత్రి అనక చాకిరీ చేయించుకుంటు ఇప్పుడు రోడ్డున పడేయడం చాలా అన్యాయమని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంఇసిసి లతో కరోనా కాలంలో కూడా ప్రభుత్వం పనిచేయించుకుందని తెలిపారు.

50 ఇళ్ళకి ఒక వలేంటిరు పని చేస్తే 50 మంది వలేంటీర్లు చేస్తున్న పనులు అంటే 3 వేల ఇళ్ళకి ఒక ఎమ్.ఇ.సి.సి పని చేస్తూ ప్రజలకి సేవాలందిస్తున్నారని అన్నారు. వారి సేవలను, శ్రమను ప్రభుత్వం గుర్తించి వారిని పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తూ, కనీస వేతనాలు చెల్లిస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్న వారిపై ఇలా నిర్ధాక్షణ్యంగా వేటు వేసి వేయడం చాలా దుర్మార్గం అన్నారు.

వారి ఉద్యోగాల్లో కోసాగించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇటీవల కాలంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి వారి సమస్యలను తెలియచేయడం జరిగిందన్నారు. వీరిని విధుల్లో కొనసాగించే బాధ్యత మాది అని హామీ ఇచ్చారన్నారు.

కాని పక్షంలో భవిష్యత్తులో యూనియన్ ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం అవుతుందని బుగత అశోక్ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్.ఈశ్వరి, పి.గౌరిసహో రిణాపాడి, కె.మహాలక్ష్మి, ఎస్.కె అయేషా, ఆర్.ఆదిలక్ష్మి, డి.ధనలక్ష్మి, వి.ఊర్మిళ దేవి, ఎమ్.సంధ్య మరియు విజయనగరం, నెల్లిమర్ల, బొబ్బిలి, రాజాం, సాలూరు, పార్వతీపురం ఎమ్.ఇ.సి.సి తదితరులు పాల్గొన్నారు.

Related posts

వచ్చేనెల 14 నుంచి పార్లమెంటు సమావేశాలు

Satyam NEWS

తెల్లజెండాలతో వచ్చి మృతదేహాలు తీసుకెళ్లండి

Satyam NEWS

ట్రాజెడీ: కోడి కత్తి గుచ్చుకుని ఒకరి మృతి

Satyam NEWS

Leave a Comment