Slider ముఖ్యంశాలు

ట్రాజెడీ: కోడి కత్తి గుచ్చుకుని ఒకరి మృతి

tragedy

కోడి పందాల కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. సంక్రాంతి సందర్భంగా గ్రామానికి సమీపంలోని పామాయిల్‌ తోటల్లో కోడిపందేలు నిర్వహించారు. కోళ్ల కాళ్లకు కత్తులు కడుతుండగా సరిపల్లి వెంకటేశ్వరరావు (55) అనే వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు.

ఈ క్రమంలో ఓ కోడిపుంజు ఒక్కసారిగా కాళ్లు విదిలించడంతో పక్కనే ఉన్న వెంకటేశ్వరరావు తొడభాగంలో కత్తి గుచ్చుకుంది. దీంతో బాగా రక్తస్రావం జరగడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. అక్కడ ఉన్నవారు వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావును పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు.

Related posts

కన్నుమూసిన కర్షక్ ఇండస్ట్రీస్ అధినేత

Satyam NEWS

గీతోపదేశం క్యాలెండర్ లో మోడీ అమిత్ షా

Satyam NEWS

కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ చింతలపల్లికే..

Satyam NEWS

Leave a Comment