31.7 C
Hyderabad
May 2, 2024 09: 12 AM
Slider జాతీయం

వచ్చేనెల 14 నుంచి పార్లమెంటు సమావేశాలు

#IndianParliament

సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా పరిస్థితుల్లో జరుగుతున్న ఈ సమావేశాలకు పార్లమెంటు సభ్యులు సహకరించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు.

లోక్ సభ,రాజ్యసభలో కరోనా నిబంధనలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే 72 గంటల ముందు పార్లమెంటు సభ్యులు, సిబ్బంది, మీడియాకు కరోనా టెస్టులు చేస్తారు. కరోనా వ్యాప్తి నివారించడానికి పార్లమెంటు పరిసరాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తారు.

దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్, ఎయిమ్స్, డిఆర్డీఓ ప్రతినిధులు, లోక్ సభ, రాజ్యసభ అధికారులతో లోక్ సభ స్పీకర్ చర్చించారు. పార్లమెంటు సమావేశాల నిర్వహణపై కసరత్తు పూర్తి చేశారు.

ఉభయ సభల ఛాంబర్స్‌లో పరిశుభ్రత సామాజిక దూరంతో  ఏర్పాట్లు చేశారు. హెల్త్ సెంటర్, అంబులెన్స్ సేవలు ,అత్యవసర బృందాలు అందుబాటులో ఉంటాయి. పార్లమెంట్ కంప్లెక్స్ లో కోవిడ్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తారు.

Related posts

ఒకే చోట ముగ్గురు యువతుల మృతదేహాలు

Satyam NEWS

రాజయ్య కడియం మధ్య రాజీ

Bhavani

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై తీర్పు నేడు

Satyam NEWS

Leave a Comment