29.7 C
Hyderabad
May 6, 2024 03: 22 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో ఆ బిల్డింగ్ లకు 50లక్షల దాకా పెనాల్టీ

#kollapurmunicipality

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ సొంటె రాజయ్య అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయన  కొల్లాపూర్ లో  బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మున్సిపల్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది  వార్త కథనాలతో పట్టణ కేంద్రంలో అక్రమంగా నిర్మాణం చేసిన బిల్డింగ్ సీజ్ అయింది. ఆ బిల్డింగ్  యజమానులతో అధికారులు కుమ్మక్కై వార్తను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్ట్ అవుట రాజశేఖర్ పై అక్రమ కేసులు పెట్టి దాడులు చేసి జైలుకు పంపించిన ఘటన అందరికీ తెలిసిందే.

నీతి నిజాయితీ అధికారులు కూడా ఉంటారు

అందరూ నీతి తప్పిన, బాధ్యతలను మరిచిన, వంటి పై వేసుకున్న యూని ఫామ్ విలువలు తీస్తూ, అధికారాన్ని, బాధ్యతలను తాకట్టు పెట్టిన అధికారులు ఉండరు. కొన్ని శాఖలో నీతి నిజాయితీగల అధికారులు కూడా ఉంటారు. అలాంటివారు రంగంలోకి దిగినప్పుడు జర చట్టాలను సక్రమంగా వినియోగించుకోవాలి. కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే కమిషనర్ సొంటె రాజయ్య పట్టణంలో అనుమతికి మించిన అక్రమ కమర్షియల్  బిల్డింగ్ లపై ఉక్కు పాదం మోపారు.

ఎన్టీఆర్ చౌరస్తాలో  అనుమతికి మించిన బిల్డింగ్ రెండు ఫ్లోర్ లను  కూల్చే  ప్రయత్నం చేశారు. ఆరోజు వాటికి హోల్స్ చేసి వదిలేశారు. పెంట్ హౌస్ తో పాటు రెండు ఫ్లోర్ లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. ఇలాగే పట్టణంలో అనుమతికి మించిన  బిల్డింగ్ ల పై కమిషనర్ సొంటే రాజయ్య  దృష్టి సారించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మను చౌదరి సూచనల మేరకు కమిషనర్ ప్రత్యేక  చర్యలు తీసుకున్నాట్లు తెలుస్తుంది.

50 లక్షల వరకు పెనాల్టీ విధిస్తూ నోటీసులు

కొల్లాపూర్ మున్సిపాలిటీలో అనుమతికి మించి నిర్మించిన  బిల్డింగ్ యజమానులకు కమిషనర్  రాజయ్య నోటీసులు జారీచేసినట్లు తెలిసింది. మొత్తం కలిపి సుమారు 50 లక్షల దాకా పెనాల్టీ విధించినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ చౌరస్తా లోని అక్రమంగా నిర్మాణం చేసిన కమర్షియల్ బిల్డింగ్ యజమానికి  14లక్షలు,యాదగిరికి 9లక్షలు, ఖలిమ్ 5లక్షలు, మరి కొంత మందికి గత కొన్ని రోజుల క్రితం నోటీస్ లు పంపించినట్లు  తెలిసింది.

పెనాల్టీతో వచ్చే ఆదాయాని మున్సిపాలిటి అభివృద్ధికి వినియోగిస్తున్నట్లు తెలిసింది .ఇదంతా గత ఏడాది  ఒక వార్త కథనాంతో మొత్తం వెలుగులోకి వచ్చాయి. అంతక ముందు అధికారుల దృష్టిలో కూడా ఉన్నది. వార్తతో బిల్డింగ్ అంశం మొత్తం వెలుగులోకి వచ్చింది.

ఆ స్థాయిలో అధికారులు నూతన మున్సిపల్  చట్టాలను ఇంప్లిమెంట్ చేశారు. చట్టాలను నెగ్లెట్ చేసిన బిల్డింగ్ యజమానులు ఇప్పుడు లక్షలలో  పెనాల్టీనీ భరించవలసిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి ఇప్పుడు  మున్సిపాలిటీకి   ఆదాయం రావడంలో ఒక వార్త కథనం ఎంతో ఉంది..ఎన్టీఆర్ చౌరస్తాలోని కమర్షియల్  బిల్డింగ్   అదనపు ఫ్లోర్లకు  అనుమతులు ఇవ్వాలి అంటే చట్టాలనే మార్చాలని కొందరు మేధావులు అంటున్నారు. అధికారులు మాత్రం మున్సిపాలిటీ అభివృద్ధి కోసమి పెనాల్టీ  నిర్ణయం తీసుకున్నట్లు  తెలుస్తుంది.

Related posts

నట శేఖర కృష్ణతో వింత అనుభవం

Satyam NEWS

పోరాడి విజయం సాధించిన ఇసుక ఎడ్లబండ్లు కార్మికులు

Satyam NEWS

బై డీఫాల్ట్ :తిరుమలలో కేటీఆర్ ఆ తప్పు తెలిసి చేశారా?

Satyam NEWS

Leave a Comment