27.7 C
Hyderabad
May 11, 2024 09: 54 AM
Slider వరంగల్

జర్నలిస్టు కుటుంబాలకు మీడియా అకాడమీ ఆర్థిక సహాయం

#media

కుటుంబంలో అండగా ఉన్న మనిషిని కోల్పోవడం చాలా బాధాకరం. ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు చనిపోవడం , వారి కుటుంబాలను ఒకే చోట చూడటం బాధగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్ , టూరిజం శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మీడియా అకాడమీ జర్నలిస్టుల సంక్షేమం కోసం అందజేసే ఆర్థిక సహాయానికై  ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి దేశంలోని ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమం ముఖ్యమంత్రి, కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది. చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం, అన్న అల్లం నారాయణ ఆధ్వర్యంలో, మీడియా అకాడమీ అండగా ఉంటుందని అన్నారు. కష్ట కాలంలో కుటుంబానికి కావాల్సింది ఒక పలకరింపు, మీకు మేము ఉన్నామనే భరోసా, దాన్ని అకాడమీ ఇవ్వడం చాలా గొప్ప సహాయం. అచ్చంపేట జర్నలిస్టు చికిత్స కోసం, ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ క్రింద 40 లక్షలు ఆర్థిక సాయం చేసిన విషయం గుర్తు చేశారు.

Related posts

మాట ఇవ్వడం.. మర్చిపోవడం కల్వకుంట్ల కుటుంబానికే సాధ్యం

Bhavani

డ్రగ్స్ మాఫియా ను ప్రశ్నిస్తే తెలుగుదేశం పై దాడి చేస్తున్నారు

Satyam NEWS

కారణ జన్ముడు కేసీఆర్: మంత్రి హరీష్ రావు

Bhavani

Leave a Comment