29.7 C
Hyderabad
May 7, 2024 03: 08 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో ఆరోగ్య మేళాను సద్వినియోగం చేసుకోండి

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హల్  నందు మంగళవారం జరిగిన ఆరోగ్య మేళా సన్నాహక సమావేశంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎం డి నిరంజన్ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సరైన పోషకాహారం లేక,ఇతర కారణాల వల్ల మానసిక ఒత్తిడికి గురై అనేక మంది అనారోగ్యల పాలు అవుతున్నారని,అటువంటి వారిలో అనారోగ్య సమస్యలను గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో హుజూర్ నగర్ టౌన్ హాల్  నందు ‘స్వాతంత్ర అమృత మహోత్సవంలో’భాగంగా ఆరోగ్య మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

ఈ ఆరోగ్య మేళా నందు చెవి,ముక్కు,గొంతు,కన్ను,నోటి క్యాన్సర్,స్త్రీ లలో రొమ్ము క్యాన్సర్,సర్వైకల్ క్యాన్సర్, మధుమేహం,రక్తపోటు తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి గుర్తిస్తారని అన్నారు.ఇట్టి ఆరోగ్య మేళాకు హాజరయ్యే వారినుండి ఆధార్ నెంబర్,ఫోన్ నెంబర్లను సేకరించి వారి యొక్క ఆరోగ్య వివరాలు అనుసంధానించడం జరుగుతుందని, దీనివలన భవిష్యత్తులో వారు ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు, ఎటువంటి మందులు వాడుతున్నారన్నది తెలుసుకుని వ్యాధులను నయం చేయడం సులభతరం అవుతుందని తెలిపారు. ఈ ఆరోగ్య మేళాను నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఎండి నిరంజన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ కిరణ్, డాక్టర్ శైలజ,డాక్టర్ ఫిరోజ్, డాక్టర్ ప్రమోద్,డాక్టర్ శ్రీనివాస్ నాయక్ హెచ్ ఈ ఓ ప్రభాకర్,హెల్త్ అసిస్టెంట్స్  రామకృష్ణ,శ్రీనివాస్,కొటేష్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

రికార్డు బ్రేక్ : ఒక్కయూపీలోనే 50వేల ముస్లింయేతర వలసదారులు

Satyam NEWS

సంప్రదాయానికి మంచిరోజులు!

Satyam NEWS

స్టేట్ మెంట్: కమ్మోళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు

Satyam NEWS

Leave a Comment