31.7 C
Hyderabad
May 7, 2024 00: 37 AM
Slider ఖమ్మం

సిపిఐ బలోపేతానికి మిలిటెంట్ పోరాటాలు

Militant struggles to strengthen the CPI

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రానున్న రోజుల్లో గ్రామీణ స్థాయిలో సిపిఐ బలోపేతానికి మిలిటెంట్ పోరాటాల కు  సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు పిలుపునిచ్చారు.  ఖమ్మం గిరిప్రసా భవన్లో జరిగిన సిపిఐ హోల్ టైమర్స్ పూర్తి స్థాయి కార్యకర్తల సమావేశం జమ్ముల జితేందర్రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బాగం మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని కేసీఆర్ పాలనలో పేడ, బడుగు, బలహీన వర్గాలకు మేలు జరగని పరిస్థితి నెలకొందని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.

భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే పేదలకు ప్రమాదం వున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజా సంక్షేమానికి పాటుపడతామని తమ తమ మేనిఫెస్టోలో పొందుపరిచి ఆ తర్వాత అధికారంలోకి రాగానే ఇచ్చి హామీలను విస్మరించి పేదలపై భారాలు మోపడమే పనిగా పెట్టుకు న్నారు. భవిష్యత్తులో పేదల సంక్షేమానికి, వారి హక్కుల సాధనకు పోరాడేది ఒక కమ్యూనిస్టులు మాత్రమే అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యడల్న పోటు ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, యర్రా బాబు, తాటి వెంకటేశ్వరరావు, తోట రామాంజనేయులు,  ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.

Related posts

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలి

Bhavani

సీబీఐటిలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం

Satyam NEWS

మే 16 నుండి దోస్త్

Bhavani

Leave a Comment