29.7 C
Hyderabad
April 29, 2024 08: 50 AM
Slider రంగారెడ్డి

సీబీఐటిలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం

#cbit

ఓటరు జాబితా లో  సవరణలు మరియు కొత్తగా ఓటర్ నమోదు కోసం ఈ రోజు సిబిఐటి కళాశాల ఎన్నికల అక్షరాస్యత క్లబ్ ఆధ్వర్యం లో  ఓటరు  నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాల వయసు నిండే ప్రతి  యువతీ, యువకులు ఈ ఆవకాశం వినియోగించుకున్నారని  తెలిపారు.  

కళాశాలలో  అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలని   విద్యార్థి వ్యవహారాలు మరియు పురోగతి సలహాదారుడు శ్రీనివాస్ శర్మ అన్నారు.  భారతదేశంలో ఓటు హక్కు అనేది వజ్రాయుధంతో సమానమని, దీనివల్ల ప్రజాస్వామ్యబద్దంగా ఓట్లు వేసి నాయకులను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు తప్పకుండా ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఎన్నికల అక్షరాస్యత క్లబ్ కన్వీనర్ డాక్టర్ జిఎన్ఆర్ ప్రసాద్   అన్నారు.  ఎన్నికల అక్షరాస్యత క్లబ్   విద్యార్థి అధ్యక్షుడు భాను ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామిక కార్యక్రమాలపై విద్యార్థలకు  అవగాహన కల్పించడం ఈ   క్లబ్ ప్రాథమిక లక్ష్యం అని తెలిపారు.

Related posts

తెలంగాణ ఆడబిడ్డ లు బతుకమ్మ పండుగ సంతోషంగా జరుపుకోవాలి

Satyam NEWS

సీక్రెట్ జీవోలు ఎందుకు? విసుక్కుంటున్న అధికారులు

Bhavani

కిడ్నీ సమస్యలు తీర్చడానికి మెడికల్ క్యాంప్

Satyam NEWS

Leave a Comment