33.7 C
Hyderabad
April 30, 2024 02: 41 AM
Slider చిత్తూరు

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలి

#Tirupati smart city

తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని తిరుపతి స్మార్ట్ సిటి ఎండి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. దేశంలోని స్మార్ట్ సిటీలతో బుధవారం స్మార్ట్ సిటీ మిషన్ జాయింట్ సెక్రటరీ, మేనిజింగ్ డైరెక్టర్ కునల్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తిరుపతి స్మార్ట్ సిటి నుండి ఎండి అనుపమ అంజలి పాల్గొని చర్చించడం జరిగింది.

అనంతరం స్మార్ట్ సిటి ఎండి అనుపమ అంజలి మాట్లాడుతూ అధికారులతో మాట్లాడుతూ తిరుపతి నగరంలో చేపట్టిన ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ నూతన భవనంతో కలిపి సిటీ ఆపరేషన్ సెంటర్బి ల్డింగ్ నిర్మాణం పనులు త్వరగా చేపట్టెలా చూడాలన్నారు.

తిరుపతి రైల్వే పార్శిల్ ఆఫీసు ఎదురుగా నిర్మించబోయే మల్టి లెవల్ కార్ పార్కింగ్ కోసం గత సమావేశంలోనే పెరిగిన అంచనా వ్యయంపై చర్చించి ఆమోదించడం జరిగిందని గుర్తు చేస్తూ పనులు చేపట్టె ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. శ్రీనివాససేతు పనులు 85 శాతం పూర్తి కావడాన్ని ప్రసంసిస్తూ మిగిలిన పనులు పూర్తికి కృషి చేయాలన్నారు. సకాలంలో పనులు పూర్తి చేసి దేశంలోనే తిరుపతి స్మార్ట్సి టికి మంచి పేరు ప్రత్యేకతలు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటి ఎస్.ఈ మోహన్, ఏఓ రాజశేఖర్, సి.ఎఫ్.ఓ మల్లిఖార్జున్, డిఈ మోహన్, ఏయికామ్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కేవలం ధైర్యంతోనే కరోనా వైర‌స్‌ను ఎదుర్కోగ‌లం

Satyam NEWS

చిన్న‌శేష వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Satyam NEWS

బర్త్ డే గిఫ్ట్: అడవుల సంరక్షణకు పునరంకితం అవుదాం

Satyam NEWS

Leave a Comment