29.7 C
Hyderabad
May 4, 2024 06: 21 AM
Slider తెలంగాణ

యాసంగి వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల్సిందే

yasangi vari grain has to be bought

తెలంగాణ‌లో యాసంగిలో రైతులు సాగు చేసిన వ‌రి ధాన్యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాల‌ని సి‌ఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క  ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం కొనుగోలు చేయ‌డంలేద‌న్న నెపంతో ధాన్యం కొనుగోలు చేయ‌మ‌న‌డం స‌రికాద‌న్నారు. కేంద్రంపై యుద్దం ప్ర‌క‌టిస్తూనే తెలంగాణ రైతుల‌ను ఆదుకోవ‌డానికి ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. అదే విధంగా రైతు బంధు ప‌థ‌కం తోపాటు గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రైతుల‌కు ఇచ్చిన ఆనేక ప‌థ‌కాల‌ను కొన‌సాగించాల‌ని కోరారు. రైతు బంధు ఇస్తున్నామ‌ని రైతుల‌కు ఇవ్వాల్సిన ఆనేక రాయితీలు, ప్రోత్స‌హాకాల‌ను బంద్ చేయ‌కుండ కొన‌సాగించాల‌ని కోరారు. పాలిహౌజ్‌, డ్రిప్‌, స్ప్లింక‌ర్స్‌, స్ప్రేయ‌ర్స్ ఇలా వ్య‌వ‌సాయ యంత్ర ప‌రికారాల‌ను ఇవ్వాల‌న్నారు. పందిరి సాగు కోసం ల‌క్ష నుంచి 5ల‌క్ష‌ల వ‌ర‌కు సాయం చేయాల‌ని కోరారు. అదే విధంగా పావ‌లా వ‌డ్డీ రుణాలు రూ.3ల‌క్ష‌ల వ‌ర‌కు ఇవ్వాల‌న్నారు. వ‌రికి ప్ర‌త్యామ్నాయంగా ఇత‌ర పంట‌లు వేసుకోవాల‌ని చెప్పి ప్ర‌భుత్వం చేతులు దులుపుకోవ‌డం స‌రికాద‌న్నారు. వ్య‌వ‌సాయ క్షేత్రాల‌కు అధికారుల‌ను పంపించి భూ సార ప‌రీక్ష‌లు చేయించి ఆభూమికి అనువుగా పంట‌లు వేయించాల‌ని, ఇందుకు రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. అదే విధంగా న‌కిలి విత్త‌నాల‌ను మార్కెట్లోకి రాకుండా క‌ట్ట‌డి చేయాల‌ని కోరారు. ఇటీవ‌ల ఖ‌మ్మం జిల్లాలో త‌న పాదయాత్ర సంద‌ర్భంగా ఒక ఊరిలో రైతులు సాగు చేసిన మొక్క జొన్న నకిలి విత్త‌నాల‌తో ఆ ఊరిలో వేసిన పంట మొత్తం దెబ్బ‌తిన్న‌ద‌ని స‌భ దృష్టికి తీసుకువ‌చ్చారు. ప‌త్తి, మిర్చి రైతులు సైతం న‌కిలి విత్త‌నాల‌తో దిగుబ‌డి రాక న‌ష్ట‌పోయార‌ని తెలిపారు. న‌కిలి విత్త‌నాలు మార్కెట్లోకి రాకుండా పూర్తిగా క‌ట్ట‌డి చేయాల‌ని డిమాండ్ చేశారు. వ్య‌వ‌సాయ పాలిటెక్నిక్ కోర్సును ఇంట‌ర్మీడియేట్‌తో స‌మానంగా గుర్తించాల‌ని ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు.

Related posts

డ‌ప్పు క‌ళాకారుల‌ను ఆదుకోవాలి

Sub Editor

ధర్మాగ్రహం: చెప్పు చూపించిన పవన్ కల్యాణ్

Satyam NEWS

పేరుకే అండర్ బ్రిడ్జ్ ఉపయోగంలో నిల్

Satyam NEWS

Leave a Comment