29.7 C
Hyderabad
May 4, 2024 03: 19 AM
Slider మెదక్

తాత్కాలిక మార్కెట్లో సౌలత్ మంచిగుంది సార్

Harishrao

కరోనా నేపథ్యంలో ఏర్పాటైన తాత్కాలిక రైతు మార్కెట్లో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని కూరగాయలు విక్రయిస్తున్న రైతులకు, వినియోగ దారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మల్టీ పర్పస్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక రైతు బజారును మంగళవారం ఉదయం మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కూరగాయల విక్రయాలు జరిపే రైతులతో కూరగాయల ధరలు ఎట్లా ఉన్నాయని, తాత్కాలిక మార్కెట్లో అనుకున్న విధంగా మీకు వెసులుబాటు ఉందా..? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు మార్కెట్లో.. సౌలత్ లు మంచిగుంది సార్ అంటూ ఇబ్బందులేమీ లేవని కూరగాయల రైతులు మంత్రికి చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరం జడ్పీ చైర్మన్ శ్రీను నివాసంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

Satyam NEWS

వర్టికల్స్ సమర్ధ అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి

Satyam NEWS

సమష్టి కృష్టితో కరోనాను ఎదుర్కొందాం

Satyam NEWS

Leave a Comment