29.7 C
Hyderabad
May 6, 2024 06: 36 AM
Slider నల్గొండ

స్వాతంత్ర పోరాటయోధుల నాటి త్యాగమే నేటి స్వేచ్ఛా వాయువులు

#suryapet

నాటి స్వతంత్ర పోరాటం సమరంలో ఎంతోమంది తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి త్యాగం చేయడం వలనే నేటి స్వేచ్ఛావాయువులు తీసుకుంటున్నామని ప్రతి ఒక్క భారతీయుడు స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్రెడ్డి అన్నారు.

దేశ స్వతంత్ర సంగ్రామం ప్రారంభమై 75 ఏళ్లు నిండిన సందర్భంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్ ఔట్రీచ్ బ్యూరో జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 28 వరకు ప్రముఖ తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ సూర్యాపేట పట్టణం గాంధీ పార్క్ లో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించి ఆయన మాట్లాడారు.

బ్రిటిష్ వారిని ఎదిరించి  తెలుగు రాష్ట్రాల్లో ని ప్రజలు నాయకులు అవిశ్రాంత పోరు సల్పారు అని గుర్తు చేశారు. భారత దేశ వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో తెలుగు ప్రజలు కూడా భాగస్వాములై తన వంతు కర్తవ్యం నిర్వహించి స్వతంత్ర సాధనలో పాలుపంచుకోవడం మనందరికీ గర్వకారణం అని చెప్పారు.

తదుపరి నిజాం ప్రభువు భారతదేశంలో విలీనం విలీనం కాకుండా ఉన్నప్పటికీ తగు చర్యలు తీసుకొని భారతదేశంలో కలవడం జరిగింది అన్నారు. స్వాతంత్రం కోసం అసువులు బాసిన అమరుల అందర్ని ప్రతి భారతీయుడు తలుచుకోవడం వారికి నివాళులర్పించడం మహా యోధులను గుర్తు తెచ్చుకోవడం ధరించడం ఇలాంటి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు.

ఆనాటి త్యాగధనుల పోరాటాలను స్మరించుకుంటూ వారి బాటలో నడవాలని ప్రతివారూ కూడా దేశభక్తిని కోవాలని అలాగే తెలంగాణ కోసం అమరులైన వారందరినీ కూడా స్మరించుకోవడం తెలంగాణ బిడ్డగా గర్వపడాలి అన్నారు. దేశ దాస్య శృంఖలాలు చేదించిన విధంగానే తెలంగాణలో కూడా దశాబ్దాల పోరాటం నెరవేరి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను నేడు ప్రతి తెలంగాణ పౌరుడు అనుభవిస్తున్నారని ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం బంగారు తెలంగాణ బాటలో నడుస్తుందని  వివరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్  పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జెడ్ పి టి సి జీడి బిక్షం, జిల్లా ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి జి కోటేశ్వరావు సమాచార ప్రసార శాఖ సీనియర్ సహకుడు హబీబ్ కళాకారులు పాత్రికేయులు వర్తక సంఘం అధ్యక్షుడు గండూరి శంకర్ కోశాధికారి వా శ్రీశైలం స్వాతంత్ర సమరయోధులు పాత్రికేయులు పాల్గొన్నారు. అనంతరం మంత్రివర్యులు ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు   తొలిసారి హైదరాబాద్ సంస్థానంలో సంపూర్ణ స్వతంత్రం కోసం పోరాడిన సమరయోధుల వివరాలతో ఈ ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించడం పట్ల నిర్వాహకులను పలువురు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

Related posts

మండుటెండలో ఎన్టీఆర్ కు టీడీపీ నివాళి…!

Bhavani

నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు కరోనాతో మృతి

Satyam NEWS

చదువుల తల్లి… ఎందుకో తెలియదు… చనిపోయింది

Satyam NEWS

Leave a Comment