37.2 C
Hyderabad
May 6, 2024 19: 17 PM
Slider ఆదిలాబాద్

పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ప‌ల్లె, పట్టణ ప్రగతి

#indrakaran reddy

ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌తే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు పల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్రమాల‌కు శ్రీకారం చుట్టార‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో భాగంగా శ‌నివారం మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని క‌బుత‌ర్ క‌మాన్, రాం రావుబాగ్ లో ప‌ర్య‌టించారు.

స్ధానికులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్యలు, మంచినీటి స‌ర‌ఫ‌రా ఎలా ఉంద‌ని, ప్ర‌తి నెల ఫించ‌న్లు అందుతున్నాయా  ఆరా తీశారు. త‌మ ఇంటికి న‌ల్లా క‌నెక్ష‌న్ ఇవ్వ‌డంలో మున్సిప‌ల్ అధికారులు నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని ఓ మ‌హిళ దృష్టికి తెచ్చారు.  న‌ల్లా క‌నెక్ష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డంపై అక్క‌డే ఉన్న అధికారుల‌పై మంత్రి ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు. వెంట‌నే న‌ల్లా క‌నెక్షన్ ఇవ్వాల‌ని ఆదేశించారు.  ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో చేప‌ట్టిన ప‌నుల‌ను స‌కాలంలో పూర్తి చేయాల‌ని, లేక‌పోతే సంబంధిత అధికారుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు.

అనంత‌రం మంత్రి మాట్లాడుతూ….గ్రామాలు, ప‌ట్ట‌ణాల అభివృద్ధి కోసం ముఖ్య‌మంత్రి ప్ర‌తీ నెల నిధులు కేటాయిస్తున్నారని, దీంతో ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతున్నాయ‌న్నారు. గ‌తంలో ఎవ్వ‌రూ కూడా ఇలా నిధులు మంజూరు చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.  ప‌ర్యావరణం, పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు.

ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల్లో భాగంగా గ్రామాలు,  కాల‌నీలో పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు, తాగునీరు, రహదారులు, తదితర మౌలిక వసతుల క‌ల్ప‌న, అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం ద్వారా  ఇంటింటికి న‌ల్లా నీళ్ళు ఇస్తున్నామ‌ని, సుర‌క్షిత‌మైన ఈ నీటినే అంద‌రూ త్రాగాల‌ని కోరారు.

మొక్కలు నాటిన మంత్రి

హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ల‌క్ష్మ‌ణ‌చాంద మండలంలోని క‌న‌కాపూర్,  సారంగాపూర్ మండ‌ల కేంద్రంలో మొక్క‌లు నాటారు. అనంత‌రం న‌ర్స‌రీని ప‌రిశీలించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో  అందరూ పాలు పంచుకోవాలని, మొక్క‌లు నాటి వాటిని సంర‌క్షించాల‌ని  కోరారు.

Related posts

జగన్‌లా జేబులు నింపుకోవడంపైనే మంత్రి రజిని శ్రద్ధ

Satyam NEWS

ఫోర్జ‌రీ సంత‌కంపై సీసీఎస్‌లో బండి సంజ‌య్‌ ఫిర్యాదు

Sub Editor

పని చేయని ‘‘అధికార’’ సెటిల్మెంట్: కొల్లాపూర్ లో అక్రమ బిల్డింగ్ కూలగొట్టుడు షురూ

Satyam NEWS

Leave a Comment