25.7 C
Hyderabad
May 24, 2025 08: 32 AM
Slider నల్గొండ

తెలంగాణాను ప్రగతి బాటన నడిపిస్తున్న మంత్రి కేటీఆర్

#Haritha Haram

టి ఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్నవెంకటరెడ్డి నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురంలో శుక్రవారం మొక్కను నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఆణిముత్యం లాంటి యువ నాయకుడు కేటీఆర్ రూపంలో దొరికాడని, ఆయన నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి లోకి దూసుకెళుతొందని కొనియాడారు. మున్సిపల్, ఐ టి శాఖా మంత్రిగా కొనసాగుతూ రాష్ట్ర ప్రగతికి కృషి చేస్తున్నారని అన్నారు.

ఐ టి రంగంలో దేశంలోనే తెలంగాణ రెండవ స్థానంలో ఉందని అన్నారు. ఐ టి రంగం జిల్లా కేంద్రాలకు విస్తరించే విధంగా కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉండగలదని అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని దీనికి కేటీఆర్ సమర్థతే కారణమని చిన్నవెంకట్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరేళ్ళ లింగస్వామి, కౌన్సిలర్ పందిరి గీత, బెల్లి సత్తయ్య, సిలివేరు మౌనిక, కోనేటి కృష్ణ, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, నాయకులు పాటి మాధవ రెడ్డి, జిట్టా బొందయ్య, ఎండి జమీరొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రయివేటు ఆసుపత్రుల కరోనా దోపిడి మొదలు

Satyam NEWS

శ్రీ పోచమ్మ దేవాలయ నిర్మాణానికి రూ.1,00,116 విరాళం

mamatha

మంత్రికి రూ.126 కోట్లు, ఎమ్మెల్యేకు రూ.186 కోట్లు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!