27.7 C
Hyderabad
May 4, 2024 07: 45 AM
Slider కృష్ణ

ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి నాని

#KodaliNani

తిరుమల డిక్లరేషన్ పైనా, దేవుళ్లపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపి మంత్రి కొడాలి నాని తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కింద స్థాయి నాయకుల వైఖరితో ప్రధాని నరేంద్ర మోదీ బజారున పడపడుతున్నారని నాని అన్నారు.

ముందు నరేంద్ర మోదీని సతీసమేతంగా ఆలయాలకు రమ్మని చెప్పాలని అన్నారు. మోదీ, యూపీ సీఎం యోగిలు ఒంటరిగానే ఆలయాలకు వెళ్తున్నారని గుర్తుచేశారు. జగన్ మాత్రం కుటుంబసమేతంగా ఆలయానికి రావాలా? అని , మోదీ తన భార్యను తీసుకెళ్లి అయోధ్య రామాలయంలో పూజలు చేయాలని వ్యాఖ్యలు చేశారు.

బీజేపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించాకే ఆలయాలపై దాడులు పెరిగాయన్నారు. శ్రీవారిని దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని మరోసారి ఉద్ఘాటించిన ఆయన స్వామి వారిపై నమ్మకంతోనే భక్తులు తిరుమలకు వస్తారన్నారు.

ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, డిక్లరేషన్‌పై చర్చ జరగాలన్నారు. అసలు ఈ నిబంధన ఎప్పుడు నుంచి అమలులో ఉందో బహిర్గతం చెయ్యాలని సీఎం జగన్‌కు కులాల, మతాలతో సంబంధం లేదన్నారు. హిందూ దేవాలయానికి వచ్చినప్పుడు హిందువులా చర్చిలో క్రైస్తవుడిలా మసీదులో సమయంలో నవాబులా ఉంటారని తెలిపాడు.

Related posts

కొల్లాపూర్ లో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా

Satyam NEWS

12న పాఠశాలల, ఇంటర్ కళాశాల బంద్ ను విజయవంతం చేయండి

Bhavani

29న కార్తీక ప‌ర్వ‌దీపోత్స‌వం

Sub Editor

Leave a Comment