23.7 C
Hyderabad
May 8, 2024 03: 47 AM
Slider ముఖ్యంశాలు

యువత లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు సాగాలి

#MinisterNiranjanReddy

జీవితంలో రాణించాలంటే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు.

బుధవారం వనపర్తి జిల్లా  కొత్తకోట మండల కేంద్రంలో దేవరకద్ర శాసనసభ్యుడు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రాఘవేంద్ర స్వామి కల్యాణ మండపంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా   మాట్లాడుతూ కష్టపడి సాధించే మనస్తత్వం ఉన్న వారు జీవితంలో రాణిస్తారని అన్నారు. అనవసరంగా సమయం వృధా చేసుకోకుండా లక్ష్యం ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు .

ప్రస్తుతం సమాజంలో గొప్ప పదవులలో ఉన్నవారు ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేసి ఫలితాలు సాధించిన వారే నని అన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్లుగా కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు.

స్థానిక శాసన సభ్యుల సహకారంతో ఏర్పాటుచేసిన ఉచిత పోలీస్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా త్వరలోనే నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు .

జిల్లా ఎస్పీ అపూర్వ మాట్లాడుతూ శిక్షణ ద్వారా కొత్త విషయాలను అవగాహన చేసుకోవడం ద్వారా ఉద్యోగాలను సంపాదించవచ్చు అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ద్వారా ముఖ్యంగా ఐపీఎస్ లాంటి పదవులు సాధిస్తే సమాజంలో మంచి గౌరవ, మర్యాదలు పెరుగుతాయి అని చెప్పారు.

పోలీసు ఉద్యోగం ద్వారా ప్రజలకు ఎంతో  మంచి సేవలు అందించే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆమె అన్నారు .సోషల్ మీడియా ఇతర  అనవసర వాటిపై దృష్టి సారించకుండా కచ్చితంగా ఉద్యోగాన్ని సాధించే దానిపైన దృష్టి పెట్టాలని ఆమె కోరారు.

దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ధ్యేయంతో వివిధ అంశాలపై  ఉచితశిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు .

త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్న దృష్ట్యా నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాధ్యమైనంత ఎక్కువ మంది ఉద్యోగాలు పొందేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కొత్తకోట మున్సిపల్ చైర్మన్ సుఖేసిని , జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్ ,మాజీ జెడ్పిటిసి విశ్వేశ్వర్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు,పి జె సంస్థల అధిపతి జగదీశ్వర్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు .

అంతకు ముందు మంత్రి  ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద నిర్మించిన చేసిన పబ్లిక్ టాయిలెట్స్ ను శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

జర్మనీలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి

Satyam NEWS

కుడితిలో పడ్డ ఎలుకల్లా మారిన వైసీపీ నేతలు

Satyam NEWS

సంపూర్ణ తెలంగాణకై సమాలోచన సమావేశం

Satyam NEWS

Leave a Comment