40.2 C
Hyderabad
April 29, 2024 17: 11 PM
Slider హైదరాబాద్

రాజకీయ నాయకులతో కలిసిన మీడియా మాఫియా

#KukatpallyPolice

సమాజహితం కోసం పనిచేయాల్సి విలేకరులు తప్పుడు దారిలో పయనిస్తున్నారా..?ఆర్టీఐ పేరున అక్రమార్కులతో అంటకాగుతూ పత్రికా విలువలను దిగజారుస్తున్నారా..? విలేకరులకు ధనార్జనే ధ్యేయమా.? సమాజహితం వారిలో మదిలో కూడా మెదలదా..?

రోడ్ల వెంట తిరిగినవారు, కులం ముసుగులో మీడియాలోకి ప్రవేశించి చేస్తున్న పనేంటి..? ఆర్టీఐ సామాన్యుడు చేతిలో అస్త్రంగా కంటే అందినకాడికి దోచుకునే వారికి ఆయుధంగా మారిందా..?

పొలిటికల్ లీడర్స్ తెరవెనుక ఉండి చక్రం తిప్పుతూ అందినకాడికి దండుకుంటున్నారా అంటే ఇన్ని ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం అవుననే.. ఇదేంటని చదివిన వారు ఆశ్చర్య పోతున్నా ఇదే నిజంగా నిజం.

ఇదీ విషయం..

ఆర్టీఐ పేరుతో బిల్డర్ల వద్ద డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు కేపీహెచ్ బీ పోలీసులు. వారు తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్ బీ పోలీసు స్టేషన్ పరిధిలోని

అడ్డగుట్టలో నివాసం ఉండే కుంచం బసంత్ రాజు, పువ్వుల భార్గవ కిరణ్ అనే ఇద్దరు నిందితులు మానవహక్కుల, పశుసంరక్షణ, పర్యావరణ పరిరక్షణ విభాగం పేరుతో భవన నిర్మాణ దారులకు లెటర్స్ రాసి భవనాలు నిర్మిస్తున్న భవనదారులను బెదిరించి లక్షలాది రూపాయల వసూళ్లకు పాల్పదుతున్నట్లు ఓ నిర్మాణదారుడు ఇటీవల కేపీహెచ్ బీ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన పోలీసులు కుంచం బసంత్ రాజు, పువ్వుల భార్గవ కిరణ్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. ఇద్దరు నిందితులు నిర్మాణదారుల వద్దకు వెళ్లి అక్రమంగా నిర్మాణాలు సాగిస్తున్నారంటూ బెదిరింపులకు పాల్పడడం, వారు వినకపోతే తనకు చెందిన లాయర్ ద్వారా హైకోర్టులో పిల్ వేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని తేలింది.

వారి వద్ద నుండి రూ. 2లక్షల నగదు, ఒక కారు, 2 సెల్ ఫోన్స్ , సంస్థ లెటర్ హెడ్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.

తెరవెనుక విలేకరులు

ఈ వ్యవహారం అంతటి వెనక కొన్ని ప్రధాన పత్రికలు, టీవీ ఛానళ్ల విలేకరులు ఉన్నారని పోలీసులు ఇచ్చిన ప్రెస్ నోట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. దీన్నిబట్టి విలేకరులు ఏస్థాయికి దిగజారిపోయారన్నది స్పష్టం అవుతోంది.

కెపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్డగుట్ట ప్రాంతంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు సాగుతున్న తరుణంలో మీడియా మాఫియా కన్ను వాటి మీద పడింది. ఇదే తరుణంలో మీడియా మాఫియాను తయారు చేసిన రాహు కేతువులు, శని గ్రహాలు అక్రమార్కులతో అంటకాగుతూ ఆర్టీఐ పేరును, మీడియాను వాడుకుంటూ  ఓ”డాన్” బిల్డర్స్ కు ఇసుక, ఇటుక, కంకర వంక పేరుతో బిల్డింగ్ దగ్గరికి వెళ్లడం, బిల్డర్ ను కలిసి బెదిరింపులకు దిగడం చేస్తున్నారన్న ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి.

వాటిని నిజం చేస్తూ తాజాగా పట్టుబడ్డ నిందితులు ఓ ఐదుగురు విలేకరుల పేర్లు చెప్పడం అందరి అనుమానాలకు తెరదించుతూ వాస్తవాలు ఏంటో వెల్లడించింది. నిర్మాణం చేస్తున్న బిల్డింగ్ లో ఉన్న లొసుగులు తెలుసుకొని మీడియా మాఫియాలో కొందరు ఒక్క గ్రూప్ గా ఏర్పాటు చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేటతెల్లం అయ్యింది.

వీరే ఏకంగా మున్సిపల్ సిబ్బందిని మేనేజ్ చేయడం, వీరి చెప్పుచేతల్లో ఉంచుకుని అధికారులను కూడా ఈ మీడియా మాఫియా ఓ ఆట ఆడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ మీడియా మాఫియా ఒక్కో బిల్డర్ దగ్గర లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడిందని, వార్తలు రాసే విలేకరుల బ్యాచ్ కు రూ. పదో పరక ఇచ్చి దేశాన్ని ఉద్దరించేశామన్న బిల్డప్ లు ఇచ్చేవారని మీడియా మాఫీయా బారిన పడ్డ విలేకరులు వాపోతున్నారు.

వీరిని కాదని వార్తలు రాసే విలేకరులను మీ ఛానల్ ఏది…? మీ పేపర్ ఏది…? అనే ప్రశ్నలతో బెదిరింపులకు దిగుతూ అటు బిల్డర్స్ కు, ఇటు అధికారుల మధ్య బ్రోకర్లుగా తయారై బెదిరింపులకు దిగడంతో విసిగిపోయిన బిల్డర్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీం ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో విచారణలో దిమ్మతిరిగే నిజాలు బయటకు వచ్చాయి.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసేందుకు పత్రిక ప్రకటన విడుదల చేశారు. అక్రమ వసూళ్లకు పాలుపడుతున్న రాజకీయ నాయకులు బసంత్ రాజ్, భార్గవ కిరణ్, గోపాల్ రావు(కాంగ్రెస్), కొడాలి రవి(టీడీపీ), మేకల వెంకటేశం(టీఆర్ ఎస్ కార్పొరేటర్), భద్రం(టీడీపీ),

డబ్బు వసూళ్లకు సహకరించిన విలేకరులు రాహుల్ ప్రదీప్(ఆంధ్రప్రభ), వేణు మాధవ్(ఏబీఎన్), నామాల శ్రీధర్ (సాక్షి), శ్రీనివాస్ యాదవ్ (నవ తెలంగాణ), నవీన్ రెడ్డి(N Tv) తో పాటు వీరికి సహకరించిన మున్సిపల్ అధికారులపై కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ సురేందర్ రావు, ఇన్స్పెక్టర్ లక్ష్మి నారాయణ, సబ్-ఇన్స్పెక్టర్ నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మిడ్ డే మీల్: గోరుముద్ద రుచి చూసిన కిల్లి కృపారాణి

Satyam NEWS

నో డాక్టర్: నడి రోడ్డుపైనే మహిళ ప్రసవం

Satyam NEWS

తెలంగాణ లో రికార్డు స్థాయిలో అడవుల పెరుగుదల

Satyam NEWS

Leave a Comment