39.2 C
Hyderabad
May 4, 2024 21: 54 PM
Slider ప్రత్యేకం

ఆడదంటే గడపదాటడంలోనే కాదు.. చరిత్ర పుటల్లో కి ఎక్కాలి

ఎప్పుడైతే ఆడపిల్ల గడపదాటిందో సగం విజయం సాధించినట్టేనని ఆ తర్వాత ఒడిదుడుకులు, అడ్డంకులను అధిగమించి చరిత్ర సృష్ఠించాలని..అదే చరిత్ర లో ఓ పేజీ ప్రతీ ఆడపిల్లది కావాలని రాష్ట్ర క్రీడల ,యువజన సర్వీసుల శాఖ మంత్రి రోజా అన్నారు. విజయనగరం శివారు డెంకాడ సమీపంలోని పీవీజీ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న టీ20 మహిళా క్రికెట్ పోటీల ముగింపు ఆటకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆద్యంతం క్రికెట్ మ్యాచ్ ను తిలకించారు.

అనంతరం.. టీ20లో విజేతగా నిలచిన విజయనగరం టీమ్ కు బహుమతి ఇచ్చారు.అనంతరం క్రీడాకారులనుద్దేశించి మంత్రి రోజా మాట్లాడుతూ… ఆడపిల్ల ప్రతీ రంగంలో నూ రాణించాలన్నారు.ప్రియతమ సీఎం జగన్… ఆడిపిల్లలకే ప్రాధాన్యత ఇస్తున్నా రన్నారు.ప్రతీ ఆడపిల్ల ఇంటి గుమ్మం దాటినప్పుడే సగం విజయం సాధించినట్లేనన్నారు.ఇక ఆ పై ప్రతీ రంగంలో అడుగు పెట్టి విజయతీరాలను తాకడమే కాకుండా విజేతలుగా నిలవాలన్నారు.

ఆ పై ప్రతీ రంగంలో చరిత్ర సృష్ఠించి ఇ పేజీ లో మీరంతా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతీ ఆడపిల్ల..ఆ విషయంలో పదునుగా తయారు కావాలి..సీఎం జగన్.. ఆడపిల్లలు ఏ రంగంలో నూ వెనకబడిపోకూడదనే పలు పధకాలు ప్రవేశ పెట్టడమే కాకుండా అమలు చేసి..రాష్ఠ్రాన్ని ప్రగతి పధంలో కి తీసుకెళుతున్నారన్నారు.అంతకు ముందు శాప్ చైర్మన్ బవిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం జగన్.. క్రీడలలో మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు వెసులుబాటు కల్పించే విధంగా ఎన్నో చర్యలు చేపడుతున్నారన్నారు.

ఈ టీ 20 మహిళా క్రికెట్ టోర్నమెంట్ ముగింపునకు..విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, మారిటైమ్ బోర్డు చైర్మన్ కేవీఆర్..ఆర్డీవో భవానీ శంకర్, బందోబస్తు నిమిత్తం భోగాపురం సీఐ విజయానంద్, డెంకాడ ఎస్ఐ పద్మావతి, పూసపాటి రేగ ఎస్ఐ నరేష్, భోగాపురం ఎస్ఐ మహేష్ అలాగే శాప్ అధికారులు.. డీఎస్ డీఓ తదితరులు హాజరయ్యారు

Related posts

ట్రాన్స్ జెండర్లపై లైంగిక దాడుల నుంచి రక్షణ ఏది?

Satyam NEWS

పోతిరెడ్డిపాడు నీటి తరలింపు ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలి

Satyam NEWS

దేవరకొండ టీఆర్ఎస్ నూతన కమిటీ నియామకం

Satyam NEWS

Leave a Comment