38.2 C
Hyderabad
May 3, 2024 19: 06 PM
Slider నల్గొండ

పోతిరెడ్డిపాడు నీటి తరలింపు ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలి

#Nalgonda Congress Party

ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే వెనక్కి వెనక్కి తీసుకోవాలని నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణకు రావాల్సిన నీటిని ఆంధ్ర ప్రభుత్వం దోపిడీ చేయడానికి కుట్రలు చేస్తోందని విమర్శించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదని ఆరోపించారు.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించికపోతే నల్లగొండ జిల్లా తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ డ్యాం కింద సుమారు 11 లక్షల ఎకరాలు సేద్యం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ ద్వారా మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, ఖమ్మం, నల్లగొండ పాత జిల్లాలు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా చెరువులు, కుంటలు నింపి ప్రజలకు తాగు సాగునీరు అందిస్తున్నారని పేర్కొన్నారు.

ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన వారిలో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, రాజా రమేష్ ,జూలకంటి సైదిరెడ్డి, అజయ్ తదితరులు ఉన్నారు.

Related posts

గ్రాడ్యుయేట్ ఓటర్ గా పేరు నమోదు చేసుకున్న కేటీఆర్

Satyam NEWS

విద్య, వైద్యం కోసం రాచాల భరోసా యాత్ర

Satyam NEWS

తల్లి కూతురు ను ఆదుకున్న దిశా యాప్

Satyam NEWS

Leave a Comment