29.7 C
Hyderabad
May 3, 2024 06: 06 AM
Slider ముఖ్యంశాలు

మేడారం అమ్మవార్ల ముక్కులు తీర్చుకున్న మంత్రి సత్యవతి రాథోడ్

#minister satyavati

ములుగు జిల్లా లో 4 వ విడత పల్లె ప్రగతి, 7 వ విడత హరిత హారంలో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్య వతి రాథోడ్ , జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య  శుక్రవారం మేడారంలో పర్యటించారు. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం అమ్మవార్ల ఆశీస్సులతో జాతర వరకు కరోనా నిర్మూలన జరగాలని మంత్రి అన్నారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా కలెక్టర్ కృషి చేస్తున్నారని, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఎనలేని సేవలు అందిస్తున్నారని మంత్రి అన్నారు. జిల్లాకు టిడయాగ్నసిస్ హెల్త్ హబ్ కేటాయించడం ప్రజలకు వరం లాంటి దాని మంత్రి అన్నారు. అలాగే ముఖ్య మంత్రి  జిల్లాల అభివృద్దికి మంత్రులకు రెండు కోట్లు, కలెక్టర్లు కు 1 కోటి నిధులు ఇవ్వడం జరిగిందని అన్నారు. 

దళిత క్రాంతి పథకం ను ముఖ్య మంత్రి ప్రవేశ పెట్టనున్నారు అని అన్నారు. జిల్లాలోని   నిరుపేద కుటుంబాలకు ఎంపిక చేసి వారికి సింగిల్ బెడ్రూం ఇల్లును నిర్మించి ఇచ్చేందుకు ఒక సేవా సంస్థ ముందుకు వచ్చిందని మంత్రి వెల్లడించారు.

ఆ పనులను మేడారంలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చర్మెన్ కుసుమ జగదీష్, ఎస్పీ సంగ్రాం సింగ్ జి పాటిల్, ఏఎస్పీ సాయి చైత్యం, ఐటీడీ ఏ పిఓ హన్మంతు కె జెండగే,అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి,రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు పల్లె బుచ్చయ్య,అత్మ  ఛైర్మెన్ దుర్గం రమణయ్య, dpo వెంకయ్య, తాడ్వాయి  తహసిల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అనురాగ్ హెల్పింగ్ సొసైటి ఆధ్వర్యంలో గాంధీజయంతి

Satyam NEWS

పాపం… ఏపీ బీజేపీ…. నాయకులకే తెలియదు….

Bhavani

అన్నా చెల్లెలు మధ్య అగాధం: విడివిడిగా నివాళి…. రాజకీయ వేడి

Satyam NEWS

Leave a Comment