31.2 C
Hyderabad
May 11, 2024 23: 30 PM
Slider క్రీడలు

చదరంగం ఛాంపియన్ లకు మంత్రి సన్మానం

#ChessChampions

16వ ఆసియా స్కూల్స్ చదరంగం ఛాంపియన్ షిప్ 2022లో స్వర్ణపతకాలు సాధించిన అక్కా చెల్లెళ్లు త్రిపురాంభిక, శ్రీ గురువర్షిని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్కే రోజా సన్మానించారు.

తిరుపతికి చెందిన త్రిపురాంభిక, శ్రీ గురువర్షిని శ్రీలంకలో జరిగిన చదరంగం ఛాంపియన్ షిప్ 2022లో ఇండియా తరపున ప్రాతినిథ్యం వహించారు.

అండర్ 11 బాలికల విభాగంలో ఛాంపియన్, రాపిడ్ విభాగంలో త్రిపురాంభిక రన్నరప్ తో రెండు రజత పతకాలు సాధించింది. అండర్ -7 బాలికల విభాగంలో ఛాంపియన్స్, బ్లిట్జ్, రాపిడ్ విభాగాల్లో మొత్తం మూడు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని సత్తా చాటింది.

మంత్రి రోజా మాట్లాడుతూ.. మా తిరుపతి జిల్లాకి చెందిన వారు కావడం చాలా సంతోషంగా ఉందని, అక్కాచెల్లెళ్ళు ఇరువురు ఛాంపియన్ షిప్ లో పాల్గొని పతకాలను సాధించడం చరిత్ర అని కొనియాడారు. ఇరువురు దేశ కీర్తి ప్రతిష్టలను చాటి జాతీయ జెండాను శ్రీలంక గడ్డపై రెపరెపలాడించారని మంత్రి తెలిపారు.

Related posts

వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్

Satyam NEWS

కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం?

Satyam NEWS

శాల్యూట్: ఇండియన్ నావీ ప్రతిష్టాత్మక ఆపరేషన్ మొదలు

Satyam NEWS

Leave a Comment