42.2 C
Hyderabad
May 3, 2024 18: 29 PM
Slider ఖమ్మం

గ్రామాలలో చెక్కుల పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

#ministerpuvvada

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని రేగులచెలక, కోయచెలక, కోటపాడు, చిమ్మపూడి, పాపడపల్లి, బూడిదపాడు, మంచుకొండ, పువ్వాడ నగర్, రఘునాధపాలెం, చింతగుర్తి, గణేశ్వరం, వేపకుంట్ల, వివి పాలెం గ్రామాల్లో లబ్ధిదారుల ఇంటింటికి మంగళవారం వెళ్ళి కళ్యాణలక్ష్మి చెక్కులను మంత్రి స్వయంగా 32 మందికి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటివరకు 5 వేల మందికి పైగా ఆడపిల్లల వివాహాలకు ఆర్ధిక సహాయం కింద కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకం ద్వారా సుమారు యాభైకోట్ల రూపాయలను అందించినట్లు మంత్రి తెలిపారు.

మొదటిలో 50 వేల రూపాయలతో మొదలైన కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకం ఆర్ధిక సహాయాన్ని 75 వేల రూపాయలుగా అనంతరం 1 లక్షా నూట పదహారు రూపాయలకు  ముఖ్యమంత్రి పెంచారని  మంత్రి తెలిపారు. పేద ప్రజలు ఆడపిల్లల వివాహాలకు ఆర్ధిక బరోసా కల్పిస్తున్న ఇట్టి పథకం తనకు ఎంతో ఇష్టమైనదని, మొదటి నుండే ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారునికి చెక్కులను అందించడం సంతృప్తినిస్తుందని మంత్రి అన్నారు.

పేద ప్రజల సంక్షేమానికి గాను రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తుందని తద్వారా ఎంతోమంది నిరుపేద కుటుంబాలు ఆర్ధికంగా బలోపేతం అయ్యాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. రఘునాథపాలెం మండలంలోని రేగుల చెలకలో ముగ్గురికి, కోయచెలకలో ఒక్కరికి, కోటపాడులో నలుగురికి, చిమ్మపూడిలో ఇద్దరికి, పాపటపల్లిలో ఒక్కరికి, బూడిదెంపాడులో ఒక్కరికీ, మంచుకొండలో ఇద్దరికి, పువ్వాడనగర్ లో ఒక్కరికి, రఘునాథపాలెంలో నలుగురికి, చింతగుర్తిలో, గణేశ్వరంలో ఒక్కొక్కరికి, వేపకుంట్లలో ఐదుగురికి, వి.వెంకటాయపాలెంలో 4 గురికి మంజూరైన కళ్యాణలక్ష్మి, చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.ఈకార్యక్రమంలో రఘునాథపాలెం జడ్పీ టి సి మాళోతు ప్రియాంక, ఎం పి పి భూక్యాగౌరీ, సుడా  డైరెక్టర్ వీరునాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేక అధికారి ఎ.విజయకుమారి, తహశీల్దారు నర్సింహారావు,  ఎంపిడిఓ రామకృష్ణ, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎం.పి.టి.సిలు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా ఎలర్ట్: కరోనాను ఎవరూ ఆహ్వానించవద్దు

Satyam NEWS

కారు ప్రమాదంలో హైదరాబాద్ యువతి బ్రెయిన్‌డెడ్

Satyam NEWS

నిత్యావసర వస్తువుల పెరుగుదల పై టీడీపీ నిరసన….

Satyam NEWS

Leave a Comment