28.2 C
Hyderabad
May 9, 2024 02: 45 AM
Slider పశ్చిమగోదావరి

శ్రీనిధి నిధుల దుర్వినియోగంపై దర్యాప్తు ఏదీ?

#dwacra

ఏలూరు జిల్లా పెదవేగి మండలం మండూరు గ్రామంలో డ్వాక్రా గ్రూపులకు మంజూరైన 70 లక్షల శ్రీనిధి నిధుల పంపిణీ లో జరిగిన అక్రమాల విచారణ అటకెక్కిందా? మొదట్లో దీనిపై అధికారులు గ్రామంలోనే విచారణ జరిపి 70 లక్షలు కాదు 18 లక్షలు మాత్రమే తేడా ఉందని తేల్చారు. దీనిపై పెదవేగి పోలీస్ స్టేషన్ లో అప్పట్లో ద్వాక్రా గ్రూపు ల మహిళా బాధితులు, వెలుగు అధికారులు పిర్యాదు చేసారు.

అయినా ఆ నిధుల అక్రమాల విచారణ లో నేటికి పురోగతి లేదని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం లో ఒకరిద్దరు గ్రామ స్థాయి రాజకీయ నాయకులు ఈ నిధుల రికవరీ జరగకుండా కాలయాపన చేయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. శ్రీనిధి నిధుల మంజూరుకన్నా ముందు కొంత మంది ద్వాక్రా మహిళలకు మంజూరైన సుమారు కోటి రూపాయలు అప్పట్లో ఓ మహిళా సంఘ నాయకురాలు గ్రూపు సబ్యులకు నోట్ లు రాసి ఆ నోట్లు గ్రూపు సబ్యులకు ఇవ్వకుండా రుణాలు మింగేసినట్టు సమాచారం. దీనిపై జిల్లా అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపితే నిధుల కుంభకోణం వెలుగు చూస్తుందని అనుకుంటున్నారు.

Related posts

మూడు రాజధానుల కాన్సెప్టుకు మేం వ్యతిరేకం

Satyam NEWS

రేపే చూడామణి నామక సూర్యగ్రహణం

Satyam NEWS

హెల్మెట్ ధరిస్తేనే మీ ప్రాణాలకు రక్షణ ఉంటుంది

Satyam NEWS

Leave a Comment