40.2 C
Hyderabad
April 29, 2024 15: 38 PM
Slider ఆధ్యాత్మికం

మరో వైఫల్యం: భవానీల దీక్ష విరమణకు ఏర్పాట్లేవీ?

#indrakeeladri

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సరైన ఏర్పాట్లు చేయకుండా భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇప్పుడు మరో విమర్శను ఎదుర్కొంటున్నది. ప్రతి ఏటా భవానీ దీక్ష సేకరించే వేలాది మంది విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దీక్ష విరమణ చేస్తారు. భవానీల మాల విరమణకు దేవస్థానం అధికారులు ఎటువంటి ఏర్పాట్ల చేయలేదు.

దాంతో భవానీల మాల విరమణపై గందరగోళం కొనసాగుతోంది. దీంతో మాల విరమణ ఎక్కడ చేయాలనే అంశం భవానీలకు అర్ధం కావడం లేదు. ప్రతి ఏడాది మల్లికార్జున మండపం పక్కనే గల ఖాళీ స్థానం హోమ గుండం, మాల విరమణకి ఏర్పాట్లు జరిగేవి.

ఈరోజు సాయంత్రం నుంచి భారీ సంఖ్యలో భవానీలు తరలివచ్చే అవకాశం ఉంది. మూడు రోజులు పాటు భవానీల తాకిడి ఉంటుంది. ఈ ఏడాది మాల విరమణకు దేవస్థానం అధికారులు ఎటువంటి ఏర్పాటు చేయకపోవడంపై గురు భవానీలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాదికి ఎటువంటి ఏర్పాటు చేయలేమని దుర్గగుడి దేవస్థానం అధికారులు చేతులెత్తేశారు.

Related posts

8న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

Satyam NEWS

కార్యాలయ పర్యవేక్షకులు గోపీనాథ్ సేవలు శ్లాఘనీయం…!

Satyam NEWS

ఎన్ఎమ్ డిసి  హైదరాబాద్ మారథాన్‌లో సి బి ఐ టి విద్యార్థులు

Satyam NEWS

Leave a Comment