26.7 C
Hyderabad
May 3, 2024 10: 37 AM
Slider జాతీయం

అఖిల భారత అందాల శ్రీమతి పోటీలలో రన్నర్ గా ప్రియాంక భరత్

#priyankabharat

విపిఆర్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఇటీవల గుజరాత్ లోని అహమ్మదాబాద్ నగరంలో నిర్వహించిన అఖిల భారత అందాల శ్రీమతి పోటీలలో యుబిఐ బ్యాంక్ మేనేజర్ ప్రియాంక భరత్ రన్నర్ గా ద్వితీయ స్థానంలో నిలిచారు. వివిధ రాష్ట్రాల నుండి 250 మంది మహిళలు ఈ పోటీ కోసం తమ పేర్లు నమోదు చేసుకోగా వారిలో 40 మందిని పోటీలకు ఎంపిక చేశారు.

జంషెడ్ పూర్ కు చెందిన  శ్రీమతి శర్మిస్ట రాయ్ విజేతగా నిలిచింది. శ్రీమతి ఇండియా 2022 ఐకాన్ గా  ప్రియాంక భరత్ రన్నర్ గ ద్వితీయ స్థానంలో నిలిచి కిరీటాన్ని ప్రశంసా పత్రాన్ని పొందారు. విజయమే ఆఖరిది కాదు… ఓటమితో ఆగి  పోనవసరం లేదు.. అనే ప్రియాంక మాటలు సభికులను ఆకట్టుకున్నాయి.

బెంగలూరు నగరంలో యు బి ఐ బ్యాంక్ మేనేజరుగా పనిచేస్తున్న  ప్రియాంక భరత్ విధి నిర్వహణలో ఉన్నతాధికారుల ప్రసమాలందుకుంటూనే తొలిసారిగా అందాల శ్రీమతి పోటీలలో పాల్గొని రెండో స్థానంలో  నిలిచి కిరీటాన్ని ప్రశంసా పత్రాన్ని పొంది పని చేసే యువతులకు స్ఫూర్తి దాయకమయ్యారు.

కలకత్తా లోని పంజాబీ   కుటుంబానికి చెందిన ప్రియాంక ఖన్నా అనంతపురం జిల్లాకు చెందిన పతకమూరి భరత్ ను ప్రేమ వివాహం చేసుకుని తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలలో మమేక మవుతున్నారు. ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తే మహిళలు ఎన్నో విజయాలు సాధించ గలరని ప్రియాంకా భరత్  అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందుకు స్ఫూర్తి కావాలని అన్నారు.

తన పురోగతికి భర్త బంధు మిత్రులు బ్యాంక్ అధికారులు అందిసున్న సహకారం కారణమన్నారు. ప్రియాంక భర్త భరత్ హైదరాబాద్ తది తర నగరాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అఖిల భారత పోటీలలో రన్నర్ గా నిలిచిన ప్రియాంకా భరత్ ను బ్యాంక్ అధికారులు బంధు మిత్రులు  అభినందించారు.

Related posts

పుంగనూరులో అల్లరిమూకలు విధ్వంసం చేయడం దారుణం

Satyam NEWS

యుద్ధం చేస్తూనే….

Satyam NEWS

సోషల్ మీడియాకు కొత్త రూల్స్.. కేంద్రం కసరత్తులు..

Sub Editor

Leave a Comment