29.7 C
Hyderabad
May 4, 2024 04: 27 AM
Slider సంపాదకీయం

Missing Logic: పేదల పట్టాలకు కరోనా అడ్డు వచ్చిందా?

#y s jagan

కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను కులంపేరుతో విమర్శించి పదవి నుంచి బయటకు పంపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు అదే కరోనా సాకుతో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటికే పలు మార్లు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కరోనా పేరు చెప్పి వాయిదా వేసింది. ఈ నెల 8న డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.

అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించారు. అయితే అప్పుడు అది చేయలేకపోయారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని అంబేద్కర్ జయంతి రోజుకు వాయిదా వేశారు.

అయితే అప్పటి కూడా పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. మళ్లీ వాయిదా పడింది. ఆ తర్వాత కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయారు. తాజాగా వై ఎస్ జయంతి రోజున ఇస్తామని ప్రకటించారు కానీ ఇప్పుడు కరోనా వ్యాప్తి కారణంగా ఇవ్వలేకపోతున్నట్లు చెప్పారు.

ఒక కోటి అరవై లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్న స్థానిక సంస్థలను కరోనా కారణంగా వాయిదా వేస్తే ఎన్నికల కమిషనర్ ను ముఖ్యమంత్రి నుంచి స్థానిక నాయకుల వరకూ విమర్శించారని, ఇప్పుడు కరోనా పేరుతో ఇళ్ల పట్టాల కార్యక్రమం వాయిదా వేసిన వారిని ఏమనాలని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

Related posts

ఫొటో ఫినిష్: కౌన్సిల్ రద్దు విధానం ఇది

Satyam NEWS

తాండూరు మార్కెట్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా

Satyam NEWS

పారామెడికల్ సిబ్బందిని ఇప్పటికైనా పర్మినెంటు చేయండి

Satyam NEWS

Leave a Comment