31.7 C
Hyderabad
May 2, 2024 07: 46 AM
Slider పశ్చిమగోదావరి

పారామెడికల్ సిబ్బందిని ఇప్పటికైనా పర్మినెంటు చేయండి

#para medical staff

కాంట్రాక్టు ప్రాతిపదికపై నియమింపబడి 20 ఏళ్లుగా సేవ చేస్తున్నా నేటికి ఉద్యోగ భద్రత లేక వయసు మీరి ఇబ్బంది పడుతున్నామని వివిధ పోస్ట్ లలో ఉన్న పారామెడికల్ సిబ్బంది వాపోతున్నారు.

ఏ పి డి ఎస్ సి .సి పి ఎం ఈ కాంట్రాక్టు ఉద్యోగుల జె ఏ సి  ఆధ్వర్యంలో లో ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అసోసియేషన్ స్టేట్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు   రాష్ట్రవ్యాప్తంగా 10 రోజులుగా   పారామెడికల్ ఉద్యోగులు నిరసనలు చేపట్టారు.

ఈ నేపథ్యంలోనే బుధవారం పశ్చిమగోదావరిజిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 20 ఏళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తూ  ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి  బలౌతూ   జీవితాలలో ఎదుగు బొదుగు లేకుండా కూడా  కరోనా విధులు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.

తమ బతుకులకు భద్రత లేకుండా పోయిందని కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు తమ గోడు వినిపించారు. ఎస్ సి లోనూ సెలక్ట్ కాబడి రోస్టర్ రిజర్వేషన్ పొంది క్లియర్ వేకెన్సీ శాంక్షనఓ  పోస్ట్ లలో నియామకం పొంది రెగ్యులరైజేషన్ కు నోచుకోలేక పోయామని వారు కలెక్టర్ కు వివరించారు.

ప్రభుత్వం ఇచ్చిన ఎక్స్ గ్రేషియా జీ ఓ నంబర్ 25 ని అమలు పరచాలని, కరోనా కారణంగా మృతి చెందిన వైద్య సిబ్బంది కుటుంబాలకు 50 లక్షల రూపాయల భీమా చెల్లించాలని వారు కోరారు.

కుటుంబం లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వాలని, ఏళ్ల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా విధులు నిర్వహిస్తున్న వారికి ట్రాన్స్ఫర్ మ్యుచ్యువల్ ట్రాన్స్ఫర్  అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.

తమ డిమాండ్లపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళతానని చెప్పారని యూనియన్ నాయకులు బి గోవిందరాజు చంద్రశేఖర్, వై శ్రీను, మీసాల మురళి, గురునాథం, వి వి శ్రీనివాసు, అరుణ, రేణుక, దేవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి కన్నా ఖండన

Satyam NEWS

ఇద్దరు ఛోటా దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

Satyam NEWS

భారీగా అంబర్ గుట్కా స్టాక్ పట్టుకున్న వర్థన్నపేట పోలీసులు

Satyam NEWS

Leave a Comment