41.2 C
Hyderabad
May 4, 2024 18: 38 PM
Slider మహబూబ్ నగర్

కాంగ్రెస్ భిక్షతో గెలిచిన ఎమ్మెల్యే బీరం దమ్ముంటే రాజీనామా చేసిరావాలి!

#rangineni

కొల్లాపూర్ లో జరిగిన బహిరంగ సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ రాహుల్ గాంధీపై చేసిన విమర్శలపై  కాంగ్రెస్ పార్టీ  కొల్లాపూర్ నియోజకవర్గ నేత  రంగినేని అభిలాష్ రావు ఫైర్  అయ్యారు. ఆదివారం చిన్నబ్బాయి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రంగినేని అభిలాష్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై,అదే విధంగా మంత్రి సింగిరెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పై రంగినేని నిప్పులు చెరిగారు.కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్షతో రాజకీయాలకు కేసీఆర్ వచ్చిన సంగతిని కేటీఆర్ మరచిపోయినట్టు ఉన్నారని రంగినేని గుర్తుకు చేశారు.రాహుల్ గాంధీ పై విమర్శలు చేసే ముందు మి రాజకీయ బతుకు ఏంటో తెలుసుకోవాలన్నారు.అదే విధంగా సింగి రెడ్డి మాటలను కడిగేశారు.కేసీఆర్ కాంగ్రెస్ లో ఉన్నపుడు సింగిరెడ్డికి రాజకీయం ఏంటో తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు సింగిరెడ్డి రాజకీయ  స్థాయి ఏంటో తెలుసుకోవాలన్నారు.

ఎమ్మెల్యే బీరం దమ్ముంటే రాజీనామా చేసి రా చూసూకుందాం!

2018 కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్షతో  ఎమ్మెల్యేగా గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ కోట పై టిఆర్ఎస్ జెండా ఎగిరెస్తాం అనే ముందు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్లో పోటీ చేయాలని రంగినేని అభిలాష్ రావు డిమాండ్ చేశారు. ఒక సామాన్యుడిని కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేపిస్తాం దమ్ముంటే గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.అదే విధంగా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడారు.

సోమశిల-సిద్దేశ్వరం వంతెన పై మాట్లాడే ముందు సిగ్గు ఉండాలి

సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణం అంశాన్ని లేవనెత్తింది కాంగ్రెస్ పార్టీ అని రంగినేని అభిలాష్ రావు అన్నారు.సోమశిల- సిద్దేశ్వరం వంతెన ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ తీసుకోచ్చిందని చెప్పిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి సిగ్గుండాలన్నారు.2007లో సింగోటం లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవానికి వచ్చే భక్తులు  సోమశిల మంచాలకట్ట వద్ద పుట్టి మునిగి 61 మంది  జలసమాధి అయ్యారన్నారు.

అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది.అప్పటి ముఖ్యమంత్రి డా.వైఎస్. రాజశేఖర్ రెడ్డి సోమశిల సిద్దేశ్వరం వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఇప్పటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి అప్పుడు శిలాఫలకానీ ప్రారంభించారు. తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా బడ్జెట్ ను రెట్టింపు చేశారన్నారు.

ఇప్పుడు సోమశిల-సిద్దేశ్వరం వంతెన మేమే తెచ్చాం అని ఎమ్మెల్యే  బీరం తలా తోక లేని మాటలు మాట్లాడుతున్నారని రంగినేని ఫైర్ అయ్యారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు వహీద్ ,పెంట్ల వెల్లి మండల అధ్యక్షుడు నరసింహ యాదవ్, చిన్నంబాయి, వీపనగండ్ల మండల నాయకులు, కొల్లాపూర్ మున్సిపల్ నాయకులు బాబా,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

తిరుపతికి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునరుద్ధరించాలి

Bhavani

Complaint to Amit shah: మితిమీరిన జగన్ రెడ్డి అరాచకాలు

Satyam NEWS

జగన్మోహన్ రెడ్డి తో విద్యావవస్దలో సమూల మార్పులు

Satyam NEWS

Leave a Comment