26.2 C
Hyderabad
October 15, 2024 13: 00 PM
Slider ప్రత్యేకం

ఈ నరరూప రాక్షసులకు హ్యూమన్ రైట్స్ ఎందుకు?

roja

షాద్‌నగర్ సమీపంలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అంటున్నారు. ఇక ఇదే ఘటనపై వైసీపీ నేత రోజా కూడా స్పందించారు. ఆడ పిల్లను కన్న ప్రతి తల్లిదండ్రులు కూడా భయపడే పరిస్థితులు వచ్చేయన్నారు.

మహిళలు ఇప్పుడిప్పుడే ధైర్యం తెచ్చుకుంటున్న రోజుల్లో వైద్యురాలిపై జరిగిన దారుణాన్ని చూస్తే మనుషులకు మానవత్వం ఉందా? అని అనిపిస్తోందని ఆమె అన్నారు. వీళ్లు మనుషులా.. మానవ మృగలా అనేది కూడా అర్థం కావడంలేదని ఆమె అన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసుల్ని అభినందించాలా?. అదే ప్రాంతంలో మళ్లీ ఇంకో ఘటన జరిగినందుకు నిందించాలా? అని రోజా ప్రశ్నించారు.

ఒక అమాయక అమ్మాయిని ఈ భూమి మీద లేకుండా చేసిన ఆ మృగాలను కట్టుదిట్టమైన భద్రతతో ఎందుకు తీసుకెళ్తున్నారు. ఆ నలుగుర్ని ప్రజలకి వదిలేస్తే వాళ్లే శిక్షిస్తారు కదా?. నేరస్థుల్ని శిక్షించాలని ప్రజలు అడుగుతుంటే వాళ్ల మీదే లాఠీ ఛార్జ్ చేయడమేంటి?. గతంలో ఇలాంటి నిందితులను ఉరి తీసినప్పుడు హ్యూమన్ రైట్స్ వచ్చాయి. అమాయకమైన ఆడపిల్లల్ని రేప్ చేసి, కాల్చి చంపినప్పుడు లేని బాధ.. వాళ్లను శిక్షించేటప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ ఎందుకు స్పందిస్తున్నాయి?.

ఒక ఆడపిల్లపై అత్యాచారం, హత్య చేసిన వాడు నరరూపరాక్షసుడై ఉంటాడు. అలాంటి వాడికి హ్యూమన్ రైట్స్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి. తల్లిదండ్రులు వెళ్లి మా అమ్మాయి కనిపించకుండా పోయింది అని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. ఎవడితోనే లేచిపోయిందోమో అని వెటకారంగా మాట్లాడుతున్నారంటే .. ఆడపిల్లకి ఏదన్నా జరిగితే ఏ ధైర్యంతో కంప్లైంట్ చేస్తారు?. పోలీస్ స్టేషన్‌లో ఫ్రెండ్లీ పోలీస్ ఉండాలి.’’ అని అన్నారు.

Related posts

హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ గెలవాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

Satyam NEWS

నవంబరులో సిఎం చేతుల మీదుగా శ్రీనివాస సేతు ప్రారంభం

Satyam NEWS

పేద రైతులకు అన్యాయం చేయడమే రెవెన్యూ అధికారుల ఉద్దేశ్యమా?

Satyam NEWS

Leave a Comment