ప్రియాంక రెడ్డి హంతకులను బహిరంగంగా ఉరి తీయాలని ఏబీవీపీ కొల్లాపూర్ శాఖ డిమాండ్ చేసింది. ఏబీవీపీ ఆధ్వర్యంలో నేడు కొల్లాపూర్ లో భారీ ప్రదర్శన జరిగింది. ఆ నర హంతకులు జీవించే హక్కును కోల్పోయారని వారి పాశవిక చర్యలకు నడి రోడ్డు మీద ఉరి శిక్ష వెయ్యాలని ఏబీవీపీ కొల్లాపూర్ డిమాండ్ చేసింది.
ఇంత ఘోరంగా హత్య జరిగినా తెలంగాణ ప్రభుత్వం స్పందించక పోవడం విడ్డురం అని, తెలంగాణ హోమ్ శాఖ మంత్రి మాటలు చూస్తే చాల భాధగా ఉన్నాయి అని వారన్నారు. ప్రజలని కాపాడాల్సిన మంత్రులు ఇలా మాట్లాడటం ఘోరమని హోమ్ శాఖ మంత్రి కుటుంబం లో ఇలా ఎవరికైనా జరిగితే ఇలాగే మాట్లాడుతారా అని వారు ప్రశ్నించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి మహిళా రక్షణ కోసం పాటు పడాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యసమితి సభ్యులు ములే భరత్ చంద్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెంటే శివకృష్ణ నగర కార్యదర్శి గువ్వలి పవన్ కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు.