38.2 C
Hyderabad
May 5, 2024 22: 28 PM
Slider నల్గొండ

400 ఎకరాలు కబ్జా చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

#uttam

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ చింతలపాలెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యం.పి.కెప్టన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 70  నుండి 75 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతోందని అన్నారు.బి.ఆర్.యస్ వైఫల్యాలు,అహంకారం,ఎమ్మెల్యేల అవినీతి దౌర్జన్యాల వలననే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తున్నాయని అన్నారు.

పదేండ్ల నుండి కేసిఆర్ మోసపూరిత వాగ్దానాలు చేస్తూ నూటికి ఒక్క పని కూడా చేయలేదని అన్నారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టించి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేశాడని అన్నారు. నాలుగేండ్లలో 400 ఎకరాలు దోచుకున్న దొంగ అని అన్నారు. సైదిరెడ్డి మరో సారి గెలిస్తే పట్టా భూములు కూడా వదలడని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న మద్యం దుకాణాలు ఒక్కొక్క దుకాణం నుండి 4 లక్షల రూపాయలు సై టాక్స్ వసూలు చేశాడని అన్నారు.

పాలకీడు యస్.ఐ ఎమ్మెల్యే అనుమతి ఉంటేనే ఇసుక తోలుకోవాలని అన్నారని అన్నారు. నియోజకవర్గంలో కొత్త లిఫ్ట్ లు దేవుడెరుగు పాత లిఫ్టులు పని చేయడం లేదని ఉత్తమ్ గుర్తు చేశారు. చింతలపాలెం మండలంలో ఆర్ & ఆర్ సెంటర్ లు కొత్త చట్టాలు తెచ్చి అభివృద్ధి చేశామని,ఇప్పుడు అవి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లా ఉన్నయానీ గుర్తు చేశారు. 60 ఏండ్ల క్రింద నిర్మాణం చేపట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్న బి.ఆర్.యస్ నాయకులకు సిగ్గుండాలని అన్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రింద కుడి,ఎడమ కాల్వల నుండి 24 లక్షల ఆయకట్టు సాగులో ఉందని,ఎడమ కాల్వ కింద 12 లక్షల ఆయకట్టు సాగు అవుతోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షకోట్ల దోపిడి చేసి ఒక్క ఎకరం నీళ్ళు పారకుండానే మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఆగ్రహం వ్యక్తం చేశారు.గలీజు గులాబీ కండువాలు వేసుకొని బి.ఆర్.ఎస్ ఫ్లెక్సీలు పెట్టుకొని రాద్దాంతం చేస్తున్నారని అన్నారు.

కమీషన్ల కక్కుర్తి కోసం నాసిరకం పనులు చేస్తున్నారని అన్నారు.బి.ఆర.ఎస్ పుణ్యమాయని తెలంగాణ రాష్ట్రం 4 లక్షల కోట్ల అప్పులో ఉందని,2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం 69 వేల కోట్ల అప్పుల్లో ఉందని అన్నారు.మిషన్ భగీరథ పేరుతో 40 వేల కోట్ల రూపాయలతో శుభ్రమైన నీరు ప్రతి ఇంటికి తెలంగాణలో ఇస్తున్నామని పార్లమెంటులో ప్రస్తావించారని,గ్రామాల్లో ఎక్కడ మిషన్ భగీరథ నీళ్ళు రావడం లేదని ఎద్దేవాచేశారు.

ప్రతి ఎన్నికల్లో రేషన్ బియ్యం సన్న బియ్యం ఇస్తామని చెప్పిన కేసిఆర్ దొడ్డి బియ్యంనే ఇస్తున్నారని అన్నారు.పై నుండి క్రింది స్థాయి వరకు బి.ఆర్.యస్ దోపిడీకి పాల్పడ్డారని, నియోజకవర్గంలో ఇసుక,గంజాయి, మద్యం,మట్టి,రేషన్ బియ్యం అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని అన్నారు. సాగర్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చామని గుర్తు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా ఖచ్చితంగా 6 హామీలను అమలు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టమైన హామీ ప్రజలకు ఇచ్చారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

షైన్ హాస్పిటల్ ఎండి సునీల్ కుమార్ రెడ్డి అరెస్ట్

Satyam NEWS

కన్నుల పండుగగా కలశ స్థాపన మహోత్సవం

Satyam NEWS

ప్రజా సంక్షేమ కోసమే టి.ఆర్.యస్ పార్టీ

Satyam NEWS

Leave a Comment