26.7 C
Hyderabad
May 3, 2024 09: 15 AM
Slider ముఖ్యంశాలు

రాబోయేది ప్రాంతీయ పార్టీల యుగం

#kcr

రాబోయేది ప్రాంతీయ పార్టీల యుగమని, అభివృద్ది జాతీయ పార్టీలతో కాదని రుజువుచేశామని బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ అన్నారు. ఖమ్మంలో ఆదివారo జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత తమదేన్నారు. అన్ని వర్గాలకు లబ్ది జరిగేలా పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. ఖమ్మం నగరాన్ని వేల కోట్ల రూపాయల తో అభివృద్ది చేశామని చెప్పారు. ఉఎన్నికల సమయంలో వచ్చే అని పార్టీల, ఆ పార్టీ అభ్యర్ధుల గుణ గణాలను పరిశీలించాలని, ప్రజలు గెలిచినప్పుడే అభివృద్ది సులభమవుతుందని, ఆ దిశగా యువత ఆలోచించాలన్నారు. ఖమ్మం లో ఎన్నికలప్పుడు వఛే తుమ్మ ముళ్లను ఎరివేయాలన్నారు.

7 సంవత్సరాల కృషి ఫలితoగా ఖమ్మం నగరం హైదరాబాద్ స్థాయిలో అభివృద్ది చెందిందన్నారు. ఒకప్పుడు ఖమ్మంలో వున్న మురికి గొల్లపాడు చానల్, లకారం చెరువులు చూసి ఇదేమి ఖమ్మం అన్నామని, కానీ పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొల్లపాడు సుందరoగా, లకారంను అందంగా తీర్చిదిద్దామన్నారు. పువ్వాడ ఇటీవల కాలంలో కూడా మున్నేరు వరద నుంచి ఖమ్మం ప్రజలను కాపాడాలని, తనతో గొడవపడి 700 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు.

ప్రభుత్వ వైద్య కళాశాల, ఐటిన టవర్, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, 6 లైన్ల రహదారులు రాష్ట్రంలోనే ఖమ్మంను మోడల్ గా మార్చాయన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో వున్న ఏకైక మండలమైన రఘునాధపాలెం మండలాన్ని 300 కోట్ల తో అభివృద్ది చేశారన్నారు. మట్టిరోడ్డు లేని మండలంగా రఘునాధపాలెం నిలిచిందని గర్వంగా చెప్పారు. పువ్వాడ అజయ్ పనితీరు వల్లే ఈ అభివృద్ది సాధ్యం అయిందని, ఐనా కొందరు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అభివృద్ది చేసినాడుకు ఒకాయన బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధులను అసెంబ్లి గేటు తాకనీయని చెపుతున్నారని వారికి, వారి అరాచకాలకు ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. ఒకాయన పువ్వాడ చేతిలో ఓడిపోయి ఇంట్లో కూర్చుంటే తాను పిలిచి మంత్రి పదవి ఇస్తే, ఆయనే తనకు మంత్రి పదవి ఇచ్చినట్లు చెపుతున్నారని, మళ్ళీ ఇప్పుడు వేరే పార్టీ లో చేరి ఖమ్మం లో తానేదో చేస్తానన్నట్లు అంటున్నాడని ఎద్దేవా చేశారు. ఎప్పుడు వుద్యమంలో పాల్గొనని, తెలంగాణ జెండా ఎత్తని బి‌జే‌పి, కాంగ్రెస్స్ పార్టీ లను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

ఖమ్మం జిల్లాలో అరాచకంగా మాటాడుతున్న ఆ ఇద్దరు నేతలను ఓడించి మూలకు కూర్చో పెట్టాలని పరోక్షంగా తుమ్మల, పొంగులేటి ల గురించి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చైతన్య వంతమైన ఖమ్మం జిల్లా ప్రజలు ఆలోచించి పార్టీ, అభ్యర్ధి గుణగణాలు పరిశీలించటంతో పాటు ఎప్పుడు అందుబాటులో వుండే పువ్వాడ లాంటి నేతను ఎన్నుకోవాలని సూచించారు. మరోవైపు కే‌సి‌ఆర్ అంటేనే సెక్యులర్ అని, మైనారిటీల కోసం అనేక పథకాలు తీసుకువచ్చి వారి గౌరవాన్ని పెంచామని చెప్పారు.

ఖమ్మం లో పువ్వాడ అజయ్ కుమార్ ను మైనారిటీలు అజయ్ ఖాన్ పిలుస్తున్నారంటే ఆయనపై వారికి వున్న అభిమానాన్ని తెలియచేస్తున్నదన్నారు. ఖమ్మం అభివృద్దికి అజయ్ వెంటనే ప్రజలంతా వుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అజయ్ మరో సారి గెలవటం ద్వారా ఖమ్మం మరింత వున్నత స్తానంలో వుంటుందని, అందుకోసం ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. సభలో ఎం‌పిలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారధిరెడ్డి, ఎం‌ఎల్‌సి తాత మధు, ఎం‌ఎల్‌ఏలు వెంకటేవీరయ్య, రాములు నాయకు, కందాల ఉపేందర్ రెడ్డి, జెడ్‌పి ఛైర్మన్ లింగాల కమల్ రాజు పాల్గొన్నారు.

Related posts

టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చాలని వినతి

Murali Krishna

తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు

Satyam NEWS

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ ఐ, ఎస్ ఐ

Satyam NEWS

Leave a Comment