Slider తెలంగాణ

షైన్ హాస్పిటల్ ఎండి సునీల్ కుమార్ రెడ్డి అరెస్ట్

hospital

పిల్లల ఆసుపత్రిలో కీలకమైన ఐసియు విభాగంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక బాలుడి మృతికి కారణమైన షైన్ హాస్పిటల్ ఎండి సునీల్ కుమార్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేశారు. సునీల్ కుమార్ రెడ్డి తో పాటు మరో నలుగురు పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల కిందట షైన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పసిపిల్లవాడు ఒకడు మరణించగా మరో ఐదుగురు పసిపిల్లలకు కాలిన గాయాలయ్యాయి. ఇప్పటికే షైన్ హాస్పిటల్ పై జిల్లా వైద్య శాఖ అధికారులు పూర్తి నివేదిక సమర్పించారు. దీనికి ఆసుపత్రి అశ్రద్ధే కారణమని విచారణ కమిటీ నివేదిక ఇవ్వడంతో ఐదుగురి పై పోలీసులు కేసు నమోదు చేశారు. నేడు  షైన్ హాస్పిటల్ ఎండి సునీల్ కుమార్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేసి బయటకు వెల్లడికాకుండా రహస్యంగా ఉంచారు. పోలీసులు తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

పోలీసుల అదుపులో ర‌వి జ్యూయ‌ల‌రీ షాపు చోరీ నిందితుడు…!

Satyam NEWS

మూడు రాజధానులకు వ్యతిరేకంగా రామ్ మాధవ్ వ్యాఖ్య

Satyam NEWS

కావ్య హాస్పిటల్ లో ముగిసిన హెల్త్ చెకప్ క్యాంప్

Satyam NEWS

Leave a Comment