40.2 C
Hyderabad
May 2, 2024 17: 16 PM
Slider ప్రత్యేకం

ప్రశాంతంగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్

#MLCKavitha

ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లాలో 22 మండలాలలో ఉదయం 9 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటింగ్ సజావుగా సాగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

క్యాంపు నుంచి పోలింగ్ కేంద్రానికి

ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో క్యాంపుకు వెళ్లిన టిఆర్ఎస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు నాలుగు రోజుల క్రితం క్యాంపుకు తరలించారు. క్యాంపుకు వెళ్లిన సభ్యులందరు ప్రత్యేక బస్సులో నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న కౌన్సిలర్లు

కామారెడ్డి మున్సిపాలిటీకి సబందించి మొత్తం 49 మంది ఓటర్లు ఉండగా అందులో టిఆర్ఎస్ 29, కాంగ్రెస్ 12, బీజేపీ 8 మంది కౌన్సిలర్లు ఎక్స్ అఫిషియోగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఉన్నారు. ఇటీవల ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీజేపీ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి 8 మంది టిఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్  కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటింగ్ తీరును పరిశీలించిన కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఉదయం 10:30 గం.లకు మున్సిపల్ కు చేరుకున్న ఆమె ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తో కలిసి మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లారు. స్థానిక కౌన్సిలర్లు అభ్యర్థి కవితను కలిశారు. స్థానిక నాయకులను ఆమె పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆమె బోధన్ బయలుదేరారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

జిలాల్లోని 22 మండలాలలో మండల పరిషత్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలలో జరిగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియను కలెక్టర్ శరత్ కుమార్ పరిశీలించారు. ఓటింగ్ తీరును అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్క ఓటరుకు ఎన్ 95 మాస్కు అందజేర్యడం జరుగుతుందని, భౌతిక దూరం పాటిస్తూ ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Related posts

2 లక్షల 78 వేల దిశా యాప్ డౌన్లోడ్ చేయించిన విజయనగరం ఎస్పీ

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లాలో మరో మూడు కరోనా కేసులు

Satyam NEWS

Attention: తుఫానుగా మారిన వాయుగుండం

Satyam NEWS

Leave a Comment