40.2 C
Hyderabad
April 29, 2024 17: 10 PM
Slider ప్రత్యేకం

కాంగ్రెస్ గెలుపు తో వైసీపీ గుండెల్లో రైళ్లు

#Jagan

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఏపిలో వైసీపీకి గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు వైసీపీకి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రధాన కారణం ఓపిఎస్ హామీ. కాంప్రెహెన్సీవ్ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపిఎస్) ను ప్రవేశ పెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇదే అంశంపై ఆ రాష్ట్రంలో పోటీ చేసిన సమాజ్ వాది పార్టీ కూడా హామీ ఇచ్చినా బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీనే ప్రజలు నమ్మారు. ఆ రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడమే కాకుండా తమ కుటుంబ సభ్యులందరితో ఓట్లు వేయించారు.

దాంతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఏపిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే సీపీఎస్ ను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సరైన అవగాహన లేకుండా చెప్పారని, ఇప్పుడు అది కుదరదని వైసీపీ నేతలు చెప్పారు. మూడున్నర సంవత్సరాలుగా సీపీఎస్ రద్దు హామీని ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చకపోవడంతో ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చారు. చర్చలకు కూడా ఇక వచ్చేది లేదని, ప్రభుత్వం తమను మోసం చేసిందనే అభిప్రాయంతో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఉన్నారు.

జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి ఓట్లు వేసినందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దు, ఓపిఎస్ హామీతో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దాంతో హామీ ఇచ్చి తప్పిన తమ పరిస్థితి ఏమిటని వైసీపీ అంతర్మధనం చెందుతోంది. తక్షణమే తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని పలువురు వైసీపీ నేతలు వైసీపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. లేకపోతే పుట్టి మునగడం ఖాయమని, ఇందుకు హిమాచల్ ప్రదేశ్ ఫలితాలే తార్కాణమని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులే 5 లక్షల మంది ఉన్నారు. ఈ ఐదు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తే పార్టీ గల్లంతు ఖాయమని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ మంకు పట్టుతో ఉన్న సీఎం జగన్ ఇప్పుడు యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Related posts

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై అమలాపురంలో నిరసన

Satyam NEWS

కరోనా విజృంభిస్తోంది అందరూ జాగ్రత్త

Satyam NEWS

సీనియర్ నటి ఎల్ విజయలక్ష్మి కి సన్మానం

Bhavani

Leave a Comment