29.7 C
Hyderabad
May 7, 2024 06: 00 AM
Slider మెదక్

మోడల్ మినిస్టర్: గర్భిణీ స్త్రీలు, ఆశ వర్కర్లకు పౌష్టికాహార కిట్లు

harish 132

ఒక్కో సెక్టార్ కు ఏం కావాలో చూస్తూ అందరి అవసరాలు తీర్చడంలో తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీష్ రావు ముందుంటున్నారు. గర్భిణీ మహిళలు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలపై ఆయన నేడు దృష్టి సారించారు. అందరి కోసం కష్టపడుతున్న ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు ఆకలితో ఉండకూడదని, గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం అందాలని భావించిన ఆయన నేడు 800 మందికి పౌష్టికాహార కిట్లు అందచేశారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో అంగడిపేటలో ని 800 మంది గర్భిణీ మహిళలు కు కిట్స్ ను ఆయన అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ గర్భిణీ మహిళలు అవసరమైన ప్రోటీన్ ఫుడ్, ఎగ్స్, ఐరన్ సప్లిమెంట్లు, కరోనా నుంచి రక్షణ కోసం మాస్కులు, శానిటైజర్ లును ఒక కిట్టు గా తయారు చేసి ఇస్తున్నామని చెప్పారు.

గర్భిణీ మహిళలు కు అవసరమైనా  బలమైన ఆహారం అందిచాలని లేకపోతే ప్రసవ సమయంలో చాల ఇబ్బందులు ఎదుర్కుంటారని ఆయన అన్నారు. అదే విధంగా ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు కూడా బాగా కష్ట పడి రోజంతా పని చేస్తున్నారని అందువల్ల వారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వారికి కూడా ఈ కిట్స్ ని సరఫరా చేస్తున్నామని చెప్పారు.

Related posts

ఓటర్ కార్డుకు ఆధార్ నంబరు అనుసంధానం

Satyam NEWS

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కార్పొరేటర్

Satyam NEWS

డిసెంబర్‌ 2న వస్తున్న ‘బురేవి’ 5న రాబోయే ‘టకేటి’

Satyam NEWS

Leave a Comment