40.2 C
Hyderabad
May 2, 2024 16: 02 PM
Slider హైదరాబాద్

తల్లుల్లారా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం క్షమించండి

sanitation workers

పారిశుద్ధ్య కార్మికులు ఈ కరోనా సమయంలో మనకు సేవ చేస్తున్న దేవుళ్లు అంటూ చేతులెత్తి మొక్కడమే కానీ వారికి మనం ఏమీ చేయలేకపోతున్నాం. మనం వారికి ఏ హెల్పూ చేయలేమని కూడా అర్ధం అయిపోయింది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు, బోనస్ విడుదల అయింది.

వారి వారి ఎకౌంట్ లో డబ్బులు పడ్డాయి. మరి వాటిని తీసుకోవాలి కదా? ఎలా బ్యాంకు సమయం తక్కువ. అందుకే వారంతా ఇలా భౌతిక దూరం కూడా పాటించకుండా ఒకరినొకరు తాకుతూనే నిలబడ్డారు. ఈ దేవుళ్లకు ఏదైనా జరగరానికి జరిగితే సమాజం మొత్తం సిగ్గుతో తల వంచుకోవాలి.

తల వంచుకోవడంతో బాటు శానిటేషన్ పనులు నిలిచిపోతే అందరం బాధపడాలి. ప్రభుత్వం, బ్యాంకులు, జీహెచ్ ఎంసి ఇలాంటి సమయాన్ని ముందే ఊహించి ఏదైనా పరిష్కారం చూపిస్తే బాగుండేది కానీ అలా జరగలేదు. అమ్మలూ మమ్ములను క్షమించండి.

Related posts

ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయం

Satyam NEWS

పవన్ పై పరువు నష్టం కేసులు పెట్టాలని జగన్ ఆదేశాలు

Satyam NEWS

వనపర్తి జిల్లాలో నేరాల తగ్గుముఖం

Satyam NEWS

Leave a Comment